- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
వాలంటీర్ వ్యవస్థపై సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ రాజకీయాల్లో వాలంటీర్ వ్యవస్థ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. వాలంటీర్ వ్యవస్థపై జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన వాలంటీర్ వ్యవస్థ ద్వారా హ్యుమన్ ట్రాఫికింగ్ జరుగుతోందని పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేయడంపై వైసీపీ నేతలు భగ్గుమంటున్నారు. పవన్ చేసిన ఈ వ్యాఖ్యలపై వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఎదురుదాడికి దిగుతున్నారు.
దీంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వాలంటీర్ వ్యవస్థ రాజకీయ దుమారం రేపుతోంది. ఇదిలా ఉండగా.. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై వాలంటీర్లు మండిపడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కల్యాణ్ దిష్టి బొమ్మలను తగలబెట్టి ఆందోళనలు చేస్తున్నారు. ఇదిలా ఉండగానే.. వాలంటీర్ వ్యవస్థపై ఏపీ బీజేపీ మాజీ చీఫ్ సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్ వ్యవస్థను పూర్తిగా రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన వాలంటీర్ వ్యవస్థ పూర్తిగా రాజకీయ దురుద్దేశమేనని ఆరోపించారు. ఎన్నికల్లో గెలుపు కోసం జగన్ ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చిందని కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజాధనంతో వాలంటీర్ వ్యవస్థను నడుపుతున్నారని వ్యాఖ్యానించారు. వాలంటీర్ వ్యవస్థ కోసం రూ. వెయ్యి కోట్ల ప్రజాధనం వృధా చేస్తున్నారని అన్నారు. దీని కోసం ఐదేళ్లలో రూ.5 వేల కోట్ల ప్రజాధనం వృధా చేశారని మండిపడ్డారు. వాలంటీర్లపై పవన్ చేసిన వ్యాఖ్యలు మంటలు రేపుతుండగానే.. సోము వీర్రాజు వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయాలని వ్యాఖ్యానించడం హాట్ టాపిక్‌గా మారింది.