- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
వంగవీటి రాధా టార్గెట్‌గా వాట్సప్ మెసేజ్‌లు.. విజయవాడ సెంట్రల్‌లో కలకలం..
దిశ, వెబ్ డెస్క్: టీడీపీ నేత వంగవీటి రాధాను కొందరు టార్గెట్ చేశారు. ఆయనపై దుష్ప్రచారం చేస్తున్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి ఆయన ఈసారి బరిలో దిగుతారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆయనను డీఫేమ్ చేసేందుకు కొందరు ప్రయత్నాలు చేస్తున్నారు. వంగవీటి రాధాను టీడీపీ నమ్మకపోవడానికి గల కారణాలంటూ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ వాట్సప్ గ్రూపుల్లో మెసేజ్‌లు సర్యూలేట్ చేస్తున్నారు.
దీంతో వంగవీటి రాధా వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. రాధాను టీడీపీకి దూరం చేసేందుకే దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడుతున్నారు. ఈ విషయాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తామని చెబుతున్నారు.
కాగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఇంచార్జిగా బోండా ఉమా పని చేస్తున్నారు. గత ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఆయన ఓడిపోయారు. ఇక ఇదే నియోజకవర్గం నుంచి వంగవీటి రాధా కూడా సీటు ఆశిస్తున్నారు. అయితే బోండా ఉమ వర్గమే తన నాయకుడిపై దుష్ప్రచారం చేస్తున్నారని వంగవీటి రాధా వర్గం ఆరోపిస్తోంది. రాధా టార్గెట్‌గా కావాలనే మెసేజులు పోస్ట్ చేశారని అంటున్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి సంబంధించిన సీటు విషయంలో చంద్రబాబు ఇంకా ఫైనల్ చేయలేదు. దీంతోనే తన నేతపై కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని రాధా అనుచరులు మండిపడుతున్నారు.
Read More..
అరకు అసెంబ్లీ TDP అభ్యర్థి ఫిక్స్.. ‘రా కదలి రా’ సభలోనే ప్రకటించిన చంద్రబాబు