రాజ్యాంగాన్ని బట్టి నడుచుకోవాలి : చంద్రబాబు అరెస్ట్‌ తీరుపై ఏసీబీ కోర్టు

by Seetharam |   ( Updated:2023-09-10 06:31:43.0  )
రాజ్యాంగాన్ని బట్టి నడుచుకోవాలి : చంద్రబాబు అరెస్ట్‌ తీరుపై ఏసీబీ కోర్టు
X

దిశ, డైనమిక్ బ్యూరో : స్కిల్ డవలప్‌మెంట్ కార్పొరేషన్ స్కాం కేసులో విజయవాడ ఏసీబీ కోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. ఈ కేసులో సీఐడీ తరఫున ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి, చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్రాలు వాదనలు వినిపించారు. అయితే ఈ వాదనల నేపథ్యంలో చంద్రబాబు నాయుడు అరెస్ట్‌పై ఏసీబీ కోర్టు అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఒక మాజీ ముఖ్యమంత్రిని ఎలా అరెస్టు చేశారంటూ సీఐడీని ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ప్రశ్నించినట్లు సమాచారం. ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి.. రాజ్యాంగం మారదు.. రాజ్యాంగాన్ని బట్టి నడుచుకోవాలి అంటూ సీఐడీ అధికారులకు ఏసీబీ కోర్టు జడ్జి హితవు పలికినట్లు తెలుస్తోంది. ముందస్తుగా గవర్నర్‌కు ఎందుకు సమాచారం ఇవ్వలేదని సీఐడీ మరియు పోలీసులను ఏసీబీ కోర్టు జడ్జి ప్రశ్నించారు. దీంతో సీఐడీ, ఏపీ పోలీసులు మౌనం దాల్చారు. తెల్లవారు జామున ఏసీబీ కోర్టులో హోరాహోరీ వాదనలు జరిగాయి. చంద్రబాబు పేరు ఎఫ్‌ఐఆర్‌లో ఎందుకు లేదని జడ్జి ప్రశ్నించారు. ఎఫ్‌ఐఆర్‌ నమోదులో ఆలస్యానికి కారణాలపై ఆరా తీశారు. చంద్రబాబు పాత్రపై ప్రాథమిక ఆధారాలున్నాయా అని జడ్జి ప్రశ్నించారు. ఈ సందర్భంగా రిమాండ్ రిపోర్టును ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి కోర్టుకు సమర్పించారు.

Also Read: స్కిల్ స్కామ్ రాజకీయ ప్రేరేపితం..చంద్రబాబును ఇరికించే కుట్ర : న్యాయవాది సిద్ధార్థ లూత్రా

Advertisement

Next Story

Most Viewed