YS Sharmila:‘వేషం, భాష రెండు మారాయి’.. డిప్యూటీ సీఎం పవన్ పై షర్మిల సెన్సేషనల్ కామెంట్స్!

by Jakkula Mamatha |
YS Sharmila:‘వేషం, భాష రెండు మారాయి’.. డిప్యూటీ సీఎం పవన్ పై షర్మిల సెన్సేషనల్ కామెంట్స్!
X

దిశ,వెబ్‌డెస్క్:ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) పై రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(YS Sharmila) సంచలన వ్యాఖ్యలు చేశారు. నిన్న(గురువారం) తిరుపతిలో జరిగిన వారాహి సభలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజు (శుక్రవారం) విజయవాడ(Vijayawada) కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో షర్మిల మీడియా సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలో ఆమె మాట్లాడుతూ.. అధికారం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ వేషం, భాష మారిపోయాయని ఎద్దేవా చేశారు. ఒకే మతానికి ప్రతినిధిగా పవన్ వ్యవహరిస్తున్నారని వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు.

అన్ని మతాలను పవన్ కళ్యాణ్ సమానంగా చూడాలని.. అన్ని వర్గాలకు న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ(Narendra Modi) డైరెక్షన్‌లో పవన్ కళ్యాణ్ యాక్ట్ చేస్తున్నారని విమర్శలు గుప్పించారు. పవన్ కళ్యాణ్ రాహుల్ గాంధీ పై విమర్శలు చేయడం కామెడీగా ఉందని షర్మిల విమర్శించారు. ఈ క్రమంలో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు రాహుల్ గాంధీ యాత్ర చేశారని గుర్తు చేశారు. అటువంటి నేతను డిప్యూటీ సీఎం పవన్ విమర్శిస్తున్నారని షర్మిల తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు.

Next Story

Most Viewed