- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
AP Politics:వైఎస్ జగన్‌పై షర్మిల ఘాటు వ్యాఖ్యలు..వైసీపీ స్ట్రాంగ్ కౌంటర్!
దిశ,వెబ్‌డెస్క్: అసెంబ్లీకి వెళ్లని జగన్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల చేసిన కామెంట్స్‌పై వైసీపీ ట్వీట్టర్ వేదికగా ఘాటుగా స్పందించింది. ప్రతిపక్షంలో ఉండి మరో ప్రతిపక్షాన్ని తిడుతున్న షర్మిలకు ప్రజా సమస్యలు కనిపించవని విమర్శించింది. ‘ఏజెంటుగా రాజకీయాలు చేసే వారికి, ప్రజల తరఫున ప్రతి క్షణం ఆలోచించి వారి కోసం పనిచేసే వారికి మధ్య తేడా ఉంటుంది. మీ మాటలు చూస్తే జగన్ గారి మీద ద్వేషమే కనిపిస్తోంది తప్ప, ప్రజా సమస్యలు ఎక్కడా కనిపించడం లేదు’ అని వైసీపీ విమర్శలు గుప్పించింది.
దివంగత మహానేత, మీ తండ్రి వైఎస్సార్ విగ్రహాలను కాల్చేస్తుంటే.. ఎప్పుడైనా మీరు నోరు విప్పారా? రాష్ట్రంలో హత్యలు, దాడులు, ఆస్తుల విధ్వంసాలు చేస్తుంటే కనీసం ఒక్క మాటైనా మాట్లాడారా? పావురాల గుట్టలో పావురమైపోయాడని వైయస్ఆర్ మరణాన్ని అవహేళన చేసిన వారితో మీరు కలిసి నడవడం లేదా? అంటూ వైఎస్ షర్మిల పై ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ క్రమంలో తెలంగాణలో మాయమాటలు చెప్పి పారిపోయి ఏపీకి వచ్చిన షర్మిల కంటే స్వార్థపరులు ఉంటారా అని ప్రశ్నించింది.