ఏపీ ప్రజలకు ఐఎండీ హెచ్చరిక ... ఇళ్ల నుంచి బయటకు వస్తున్నారా..?

by srinivas |
ఏపీ ప్రజలకు ఐఎండీ హెచ్చరిక ... ఇళ్ల నుంచి బయటకు వస్తున్నారా..?
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భానుడు తన ప్రతాపం చూపిస్తున్నారు. రోజు రోజుకు ఎండ తీవ్రత సైతం పెరుగుతూ ఉంది. అయితే శుక్రవారం ఎండల తీవ్రత మరింత ఎక్కకువగా ఉంటుందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. రాష్ట్రంలో ఐఎండి అంచనాల ప్రకారం శుక్రవారం 7 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 168 మండలాల్లో వడగాల్పులు, ఎల్లుండి 106 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఎండ నుంచి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా.బి.ఆర్ అంబేద్కర్ వెల్లడించారు.

వడగాల్పులు వీచే అవకాశం ఉన్న మండలాలు జిల్లాల వారీగా పరిశీలిస్తే అల్లూరిసీతారామరాజు-7, అనకాపల్లి-13, తూర్పుగోదావరి -14, ఏలూరు-11,గుంటూరు-11, కాకినాడ -14, కోనసీమ- 6, కృష్ణా -11, నంద్యాల- 4, ఎన్టీఆర్ -16,పల్నాడు-8, పార్వతీపురం మన్యం -12, శ్రీకాకుళం -13,విశాఖపట్నం -4, విజయనగరం -22, వైఎస్సార్ కడప-2 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా.బి.ఆర్ అంబేద్కర్ వెల్లడించారు. ఇకపోతే గురువారం అనకాపల్లి- 8, కాకినాడ -1, నంద్యాల-1, విజయనగరం-1 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచాయని.. 60 మండలాల్లో వడగాలులు నమోదైనట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా.బి.ఆర్ అంబేద్కర్ స్పష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed