- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Visakha Honey Trap Case: జమిమా విచారణలో సంచలన విషయాలు
దిశ, వెబ్ డెస్క్: విశాఖ హనీ ట్రాప్ కేసు(Visakha Honey Trap Case)లో నిందితురాలు జెమిమా(Accused Jemima)ను రెండో కస్టడీలో పోలీసులు ప్రశ్నించారు. జమిమాకు ఉన్న పరిచయాలపైనా ఆరా తీశారు. అయితే కీలక వ్యక్తుల పేర్లు వెల్లడించినట్లు తెలుస్తోంది. అలాగే వాళ్ల డేటాను కూడా స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఓ ఫారెస్ట్ అధికారితో ఉన్న సంబంధాలపైనా ప్రశ్నించారు. పలు కీలక ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది.
ఇక మూడు రోజుల కస్టడీ(Custody)లో భాగంగా జమిమాను కంచరపాలెం పోలీసులు(Kancharapalem Police) గురు, శుక్రవారం విచారించారు. ఈ కేసులో కొందరు డిపార్ట్‌మెంట్ కు సంబంధించిన వ్యక్తులు సైతం ఉన్నట్లు సమాచారం. ఇక కస్టడీ ముగిసిన తర్వాత వైద్య పరీక్షల కోసం కేజీహెచ్(KGH) వద్దకు జమిమాను వెనుక నుంచి తీసుకెళ్లడంపై పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ మూఠాలో పలువురు డిపార్ట్‌మెంట్ అధికారుల ప్రమేయం ఉన్నట్లు చెబుతున్నారు.
మరోవైపు హనీ ట్రాప్ ముఠాను పట్టుకునేందుకు పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఇప్పటికే ప్రధాన నిందితులు కిషోర్‌ను అరెస్ట్ చేశారు. జమియా మోసం బాధితులు ఒక్కొక్కరుగా ఫిర్యాదు చేస్తున్నారు. దీంతో కేసును సీరియస్ తీసుకున్నారు. మరింత లోతుగా విచారణ జరుపుతున్నారు.