TDP:వైఎస్ విజయమ్మ బహిరంగ లేఖ పై స్పందించిన టీడీపీ.. సంచలన ట్వీట్!

by Jakkula Mamatha |
TDP:వైఎస్ విజయమ్మ బహిరంగ లేఖ పై స్పందించిన టీడీపీ.. సంచలన ట్వీట్!
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan), ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(YS Sharmila) మధ్య తలెత్తిన ఆస్తుల వివాదం రాష్ట్ర రాజకీయాల్లో చర్చానీయాంశంగా మారింది. వైఎస్ జగన్ తన కుటుంబ సభ్యులు అయిన వైఎస్ విజయమ్మ, వైఎస్ షర్మిలకు నోటీసులివ్వడం సంచలనంగా మారింది. ఈ క్రమంలో నేడు(మంగళవారం) వారిద్దరి(వైఎస్ జగన్, షర్మిల) ఆస్తుల వివాదం పై వైఎస్ విజయమ్మ(YS Vijayamma) స్పందించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆమె బహిరంగ లేఖ(open letter) రాశారు. అయితే వైఎస్ విజయమ్మ రాసిన లేఖ పై తాజాగా టీడీపీ(TDP) ట్విట్టర్ వేదికగా స్పందించింది. ఈ నేపథ్యంలో ‘‘వైఎస్ జగన్ ఎంత సైకోనో ఆయన తల్లి విజయమ్మ రాసిన లేఖలో స్పష్టమవుతోందని టీడీపీ వ్యాఖ్యానించింది. ‘కుటుంబ సభ్యులని జగన్ ఎలా వాడుకొని వదిలేస్తాడో, తండ్రి పరువు ఎలా తీస్తాడో, చెల్లికి ఇవ్వాల్సిన ఆస్తులు ఎలా లాక్కుంటారో చెబుతూ విజయమ్మ లేఖ రాశారు. రాజకీయ ముసుగులో ఇలాంటి వ్యక్తి సమాజంలో తిరగడం ఎంత ప్రమాదమో ప్రజలు తెలుసుకోవాలి అని’’ ఫ్యామిలీ విలన్ జగన్, జస్టిస్ విజయమ్మ హ్యాష్‌ట్యాగ్స్‌తో టీడీపీ ట్వీట్ చేసింది.

Advertisement

Next Story

Most Viewed