పవన్ తప్పుకుంటే సీటు నాదే..పిఠాపురం మాజీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు?

by Jakkula Mamatha |   ( Updated:2024-03-20 12:42:53.0  )
పవన్ తప్పుకుంటే సీటు నాదే..పిఠాపురం మాజీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు?
X

దిశ ప్రతినిధి,పిఠాపురం:రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారిన పిఠాపురంలో పవన్ పోటీ రోజుకో మలుపు తిరుగుతోంది.కాకినాడ ఎంపీగా పిఠాపురం జనసేన ఇన్చార్జ్ తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్ ను పవన్ ప్రకటించిన నేపథ్యంలో ఇప్పుడు అదే సీటు ఆశిస్తున్న పిఠాపురం టీడీపీ ఇన్చార్జి మాజీ ఎమ్మెల్యే వర్మ మరో సంచలనానికి తెర లేపారు. తాను ఎంతో కాలంగా పిఠాపురం నియోజకవర్గంతో అనుబంధాన్ని ఏర్పరచుకున్నానని , పొత్తు విషయంలో పవన్ కి పిఠాపురం సీటు కేటాయించి తన సీటును త్యాగం చేయాలని చంద్రబాబు కోరారన్నారు.చంద్రబాబు ఆదేశం ప్రకారం తాను పిఠాపురం సీటు వదులుకున్నాను.అది కేవలం పవన్ కళ్యాణ్ కోసమేనని గుర్తు చేశారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అవసరాన్ని బట్టి కాకినాడ ఎంపీగా పోటీ చేస్తానని చెప్పారని ,అలా జరిగితే పిఠాపురం సీటు తనకు ఇవ్వాలని పవన్ తో పాటు చంద్రబాబును కోరుతున్నామన్నారు.

పవన్ కళ్యాణ్ పోటీ నుంచి తప్పుకుంటే తాను కచ్చితంగా పిఠాపురం నుంచి తాను పోటీలో ఉంటానని ఇందుకు చంద్రబాబు కూడా అంగీకరిస్తారనే నమ్మకం ఉందన్నారు.ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గంలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారే పోటీకి దిగుతున్నారని వర్మ గుర్తు చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో తనకు సొంత నియోజకవర్గం పిఠాపురం నుంచి పోటీ చేయడం అనివార్యమన్నారు.పార్టీ కోసం,పేద ప్రజల కోసం ఎంతో కష్టపడ్డ తనను గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు.ప్రజలు అదే కోరుకుంటున్నారని వర్మ చెప్పుకొచ్చారు. పవన్ పోటీ పై ఎటువంటి మార్పులు లేకపోతే పవన్ గెలుపే లక్ష్యంగా పిఠాపురంలో తాను కృషి చేస్తానని మరోసారి వర్మ గుర్తు చేశారు.ఒకవేళ సీటు మారే ఉద్దేశం పవన్ కి ఉంటే తనను దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోవాలని అధిష్టానాన్ని కోరుతున్నట్లు వర్మ తెలిపారు.

Read More..

ఒక్క ముక్క కూడా హిందీ రాదు.. చంద్రబాబుపై కేశినేని నాని సెటైర్లు

Advertisement

Next Story

Most Viewed