షర్మిల పై కాంగ్రెస్ సీనియర్ నేత సంచలన వ్యాఖ్యలు?

by Jakkula Mamatha |   ( Updated:2024-05-24 12:16:04.0  )
షర్మిల పై కాంగ్రెస్ సీనియర్ నేత సంచలన వ్యాఖ్యలు?
X

దిశ,రాజమహేంద్రవరం:మూడేళ్ల క్రితమే షర్మిల రాష్ట్ర రాజకీయాల్లోకి వచ్చి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, మాజీ ఎంపీ వీహెచ్‌ హనుమంతరావు పేర్కొన్నారు. హైదరాబాద్‌ ఉప్పల్‌ క్రికెట్‌ స్టేడియంలో రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని నెలకొల్పే పనుల్లో భాగంగా రాజమహేంద్రవరంలో విగ్రహాన్ని తయారు చేస్తున్న వడయార్‌ను కలిసి విగ్రహాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లి తన అన్న జగన్‌తో తేల్చుకోవాలని గతంలోనే తాను షర్మిలకు సూచించానని గుర్తుచేశా రు.

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రాజీవ్‌ గాంధీ కళాశాలలో అమలా పురం మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్‌తో కలిసి అయన విలేకరులతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌లో మరొక ఐదేళ్లలో పరిస్థితులన్నీ సర్దుకుని కాంగ్రెస్‌ పార్టీ బలపడుతుందన్నారు. దేశవ్యాప్తంగా ఎన్‌డీఏ అవుట్‌ కావడం ఖాయమని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. ఇండియా కూటమి‌పై ప్రధాని మోదీ ఇష్టానుసారం వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు.

Read More..

‘చంద్రబాబు, లోకేష్‌ ఒకేరోజు బాధ్యతలు చేపట్టాలి’

Advertisement

Next Story