బీజేపీ పాలనలో మైనార్టీలకు భద్రత కరువు

by Jakkula Mamatha |   ( Updated:2024-03-26 15:03:25.0  )
బీజేపీ పాలనలో మైనార్టీలకు భద్రత కరువు
X

దిశ,రాయచోటి:ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పునర్ వైభవం ప్రారంభమైందని మాజీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ తులసి రెడ్డి అన్నారు. పది సంవత్సరాల అరణ్యవాసం, వనవాసం ముగిసి తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం జరిగింది.అదే విధంగా ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ అధికారంలో రానుందని ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. మొన్న కర్ణాటకలో కాంగ్రెస్, నిన్న తెలంగాణలో కాంగ్రెస్ విజయం సాధించింది.రేపు ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ వై నాట్ కాంగ్రెస్ ఇన్ ఏపీ అంటూ ఆయన అందరినీ ఆశ్చర్యపరిచారు.

మంగళవారం పట్టణంలో ని డిసిసి కార్యాలయంలో ఆయన ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఇండియా కూటమిలోని సిపిఐ, సిపిఎం వంటి మిగతా పార్టీలతో కలిసి 25 లోక్ సభ స్థానాలు, 175 అసెంబ్లీ స్థానాలకు పోటీ చేయబోతున్నామని చెప్పారు.బీజేపీ పాలనలో మైనార్టీలకు భద్రత కరువైంది. మైనార్టీలు అభద్రతా భావంతో ఉన్నారని ఆయన అన్నారు. పార్లమెంట్ లో బీజేపీ ప్రవేశపెట్టిన ప్రతి ప్రజా వ్యతిరేక బిల్లుకు బాబు జగన్ మద్దతు తెలిపారని అన్నారు.

Advertisement

Next Story