- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జగన్ అండతోనే ఇసుక మాఫియా చెలరేగుతోంది: అచ్చెన్నాయుడు
దిశ, డైనమిక్ బ్యూరో : నెల్లూరు జిల్లా బీరంగుంటలో ఇసుక అక్రమ రవాణాని ప్రశ్నించిన టీడీపీ నేత నరేంద్రపై వైసీపీ శాండ్ మాఫియా దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఓ ప్రకటనలో తెలిపారు. మీ అవినీతిని ప్రశ్నిస్తే దాడులు చేస్తారా? రాష్ట్రంలోని సహజ వనరుల్ని వైసీపీ నేతలు దోచుకుంటుంటే చూస్తూ ఊరు కోవాలా ? వైసీపీ నేతలు నెల్లూరు జిల్లాలో రోజు వేలాది లారీల ఇసుక పొరుగు రాష్ట్రాలకు అక్రమంగా తరలిస్తుంటే అధికారులు ఏం చేస్తున్నారు? అని ప్రశ్నించారు. గురువారం తనపై దాడి జరిగిందని నరేంద్ర ఫిర్యాదు చేసినా పోలీసులు ఎందుకు పట్టించుకోలేదు? అని నిలదీశారు.
అధికార పార్టీకే పోలీసులు రక్షణ కల్పిస్తారా? నరేంద్ర ఫిర్యాదు చేసిన వెంటనే చర్యలు తీసుకుని ఉంటే మరోసారి దాడి జరిగేదా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తావా అంటూ అర్ధరాత్రి టీడీపీ నేతపై వైసీపీ గూండాలు దాడి చేశారంటే రాష్ట్రంలో శాంతిభద్రతలు ఎలా అమలవుతున్నాయో అర్ధం చేసుకోవచ్చని విమర్శించారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, అవినీతిపై ప్రశ్నించిన టీడీపీ నేతలు, కార్యకర్తలపై దాడులకు తెగబడి అంతమొందిస్తున్నారు. వైసీపీ నేతల దాడులు, పోలీసుల అక్రమ కేసులు టీడీపీ నేతల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేవు. జగన్ అరాచక పాలనపై మా పోరాటం ఆగదు అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి: సీఎం జగన్‌కు భయమేంటో చూపిస్తా: నారా లోకేష్ వార్నింగ్