‘దేశ జీడీపీలో ఏపీ వాటా 4. 82 శాతానికి పెరగడం అభివృద్ధి కాదా?’: సజ్జల సంచలన కామెంట్స్

by Disha Web Desk 9 |
‘దేశ జీడీపీలో ఏపీ వాటా 4. 82 శాతానికి పెరగడం అభివృద్ధి కాదా?’: సజ్జల సంచలన కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణా రెడ్డి తాజాగా టీడీపీ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం తాడేపల్లిలో ఆయన మాట్లాడుతూ.. కరోనా సమయంలో వాలంటీర్లకు అద్భుతమైన సేవలందించామని అన్నారు. వాలంటీర్ల నియామకం ఏపీలో విప్లవాత్మక మార్పు తీసుకొచ్చిందని తెలిపారు. సంక్షమ పథకాలతో ప్రతీ కుటుంబంలో వచ్చిన మార్పును గమనిస్తున్నామని వెల్లడించారు. మేం అధికారంలోకి రావడానికి ముందు మహిళా సంఘాలకు అన్యాయం జరిగిందని సజ్జల ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇప్పుడు మహిళా సంఘాల్లో కోటి 15 లక్షల మంది ఉన్నారని అన్నారు. అధికారం కోసం మూడు పార్టీలు మళ్లీ ఒక్కటయ్యాయని ఆరోపించారు. 16 లక్షల మందకి జగనన్న తోడు పథకం అందుతుందన్నారు. 4 లక్షల మంది రైతులు అమూల్‌తో కలిసిపోయారని తెలిపారు. రాష్ట్రంలో ఉన్న కోటి కుటుంబాలు సొంత కాళ్లపై నిలబడేలా చేశామని చెప్పుకొచ్చారు. జనం వారికి వారుగా బతికేలా చేయడం అభివృద్ధి కాదా? దేశ జీడీపీలో ఏపీ వాటా 4. 82 శాతానికి పెరగడం అభివృద్ధి కాదా? అని సజ్జల ప్రశ్నించారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed