- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Sajjala Ramakrishna Reddy: పట్టాభిరామ్ చెప్పేవి అబద్ధాలు.. అదంతా ముందస్తు ప్లాన్
దిశ, వెబ్ డెస్క్: గన్నవరం ఇష్యూపై ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. బీసీలకు ఎమ్మెల్సీ పదవులు ఇస్తే అది ప్రజలకు తెలియకూడదనే.. గన్నవరంలో గొడవలు సృష్టించారని ఆయన ఆరోపించారు. ప్రభుత్వం, పార్టీ ఎప్పుడు మంచి పని చేసినా దాన్ని అడ్డుకునే కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఏదో జరిగిపోతున్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇక టీడీపీ నేత పట్టాభిరామ్ తనను పోలీస్ స్టేషన్ కొట్టారనే ఆరోపణలపై ఆయన స్పందించారు. పట్టాభిరామ్ అబద్ధాలు చెప్పారని వ్యాఖ్యానించారు. అబద్ధాలు ఎలా చెప్పాలో టీడీపీ నేత చెంగల్రాయుడు పార్టీ మీటింగ్‌లోనే చెప్పారని సజ్జల విమర్శించారు. శిక్షణా తరగతుల్లో చంద్రబాబు ముందు చెంగల్రాయుడు మాట్లాడని సజ్జల తెలిపారు.
పోలీస్ స్టేషన్‌లో నన్ను కొట్టారు: పట్టాభి
కాగా గన్నవరంలో టీడీపీ, వైసీపీ నేతలు పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ దాడులకు టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభిరామ్ చేసిన రెచ్చగొట్టే వ్యాఖ్యలే కారణమని పోలీసులు అరెస్ట్ చేశారు. హైకోర్టులో ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా పోలీసులు తనను కొట్టారని పట్టాభిరామ్ హైకోర్టులో తెలిపారు. దీంతో పట్టాభిని పరిశీలించి జీజీహెచ్ డాక్టర్లు రిపోర్టు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. పట్టాభికి రిమాండ్ విధించింది. ఈ మేరకు ఆయనను గన్నవరం సబ్ జైలుకు తరలిస్తూ ఆదేశిచ్చింది.