Sajjala: త్వరలోనే రాష్ట్రంలో ఎన్నికలు.. సజ్జల హాట్ కామెంట్స్

by Rani Yarlagadda |
Sajjala: త్వరలోనే రాష్ట్రంలో ఎన్నికలు.. సజ్జల హాట్ కామెంట్స్
X

దిశ, వెబ్ డెస్క్: త్వరలోనే ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు రాబోతున్నాయని, ఆ ఎన్నికల్లో విజయం వైఎస్సార్సీపీదేనని జోస్యం చెప్పారు ఆ పార్టీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy). ఇటీవల రాష్ట్రంలో ఆడపిల్లలపై జరుగుతున్న దారుణాలు చూస్తుంటే.. శాంతి, భద్రతలు కుంటుపడినట్లు కనిపిస్తోందన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం కనిపించడం లేదన్న ఆయన.. ప్రతిరోజూ ఏదోక అరాచక ఘటన చూస్తూనే ఉన్నామన్నారు. వైసీపీ నేతలపై తప్పుడు కేసులు పెడుతున్నారని దుయ్యబట్టారు. ప్రభుత్వం ప్రజలను అడ్డంగా దోచుకుని జేబులు నింపుకుంటోందని ఆరోపించారు.

సీఎం హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడు తిరుమల లడ్డూ (Tirumala Laddu) పై విషప్రచారం చేశారని విమర్శించారు. సూపర్ సిక్స్ హామీలను పూర్తిగా అమలు చేయకుండా.. ఐదు నెలల్లో రూ.53 వేల కోట్ల అప్పు చేశారన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల్ని చూస్తుంటే.. త్వరలోనే ఎన్నికలు జరిగే అవకాశాలు కన్పిస్తున్నాయని, పార్టీ అధిష్టానం పటిష్టమైన కార్యకర్తల్ని సిద్ధం చేస్తోందన్నారు. రానున్న ఎన్నికల్లో విజయం వైసీపీదేనని (YSRCP) ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Advertisement

Next Story

Most Viewed