- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పవన్ కల్యాణ్ వల్ల సాయిధరమ్ తేజ్‌కి నష్టం: మాజీమంత్రి వెల్లంపల్లి లోగుట్టు
దిశ, డైనమిక్ బ్యూరో : రాజకీయాల్లో జీరోగా ఉన్న పవన్ కల్యాణ్ సినిమా పరంగా కూడా జీరో కాబోతున్నాడు అని మాజీమంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు.పవన్ కల్యాణ్ వల్ల అతని మేనల్లుడు సాయిధరమ్ తేజ్‌కి నష్టం జరిగింది అని అన్నారు. విజయవాడలో గురువారం వెల్లంపల్లి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. బ్రో సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యింది అని అన్నారు. ప్యాకేజీ రాజకీయాలు చేస్తున్నావని పవన్ కల్యాణ్‌ను అభిమానులు అసహ్యించుకుంటున్నారు అని చెప్పుకొచ్చారు. సినిమాల్లో రాజకీయ డైలాగులు పెట్టడం వల్ల ఎవర్నీ భయపెట్టలేవు అని వెల్లంపల్లి శ్రీనివాస్ హెచ్చరించారు. పేద ప్రజలకు న్యాయం చేసేందుకు సీఎం జగన్ ఎంతవరకైనా వెళ్తారని చెప్పుకొచ్చారు. అమరావతిలో పేదలు నివాసం ఉండకూడదు అన్న చంద్రబాబు ఆలోచన దుర్మార్గం అని..కానీ పేదలకు అండగా వైసీపీ అండగా ఉంటుందని అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మాత్రం పెత్తందారులకు అండగా నిలుస్తున్నారని చెప్పుకొచ్చారు.నారా లోకేశ్ సాయంత్రం పాదయాత్ర చేస్తాడు..పవన్ కల్యాణ్ కూడా సాయంత్రమే వారాహి ఎక్కుతాడు అని వెల్లంపల్లి శ్రీనివాస్ ఎద్దేవా చేశారు.
పథకాల కోసమే సురక్ష
జగనన్న సురక్ష పేరుతో దేశంలోనే ఎవరూ చేయని విధంగా పేదలకు మేలు చేసినట్లు వెల్లంపల్లి వెల్లడించారు. పేదలందరికీ సురక్ష ద్వారా సర్టిఫికెట్స్ అందించి పథకాలు అమలు చేస్తున్నామని చెప్పుకొచ్చారు. భారతదేశ చరిత్రలో ఈ కార్యక్రమం చిరస్థాయిగా నిలిచిపోతుంది అని అన్నారు. 15వేల సచివాయలయాల్లో కోటిమందికి లబ్ధి చేకూరింది అని అన్నారు. 93.5లక్షల అభ్యర్థనలు పరిష్కరించినట్లు వెల్లడించారు. జూలై 17 ఒక్కరోజే 7.5లక్షల సర్టిఫికెట్స్ అందించి రికార్డు సృష్టించినట్లు తెలిపారు. విజయవాడ పశ్చిమలో 85వేల ఇళ్లకు చేరువై 90 క్యాంపుల ద్వారా 31వేల సర్టిఫికెట్లు అందించినట్లు వెల్లంపల్లి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. 40ఏళ్ల ఇండస్ట్రీ చంద్రబాబుకి ఏనాడూ ఇలాంటి ఆలోచన రాలేదు అని చెప్పుకొచ్చారు. చంద్రబాబు అయితే పత్రాలు లేవని పథకాలు ఆపేసేవారు అని గుర్తు చేశారు. పథకాల అమలుకు ప్రభుత్వ లోపం ఉండకూడదనే సురక్ష తీసుకొచ్చాం అని మాజీమంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ వివరించారు.