- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బ్రిటిషర్ల లక్షణాలు పుణికి పుచ్చుకున్న పాలకులను రాష్ట్రం నుంచి పంపించాలి : పవన్ కల్యాణ్
దిశ, డైనమిక్ బ్యూరో : బందరులో నేడు గాంధీజయంతి వేడుకలు జరుపుకుంటున్నామని వచ్చే ఎన్నికల అనంతరం మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే బందరులో గాంధీ జయంతి వేడుకలు జరుపుకోవాలన్నదే తన లక్ష్యమని పవన్ కల్యాణ్ అన్నారు. గాంధీ జయంతి సందర్భంగా మచిలీపట్నం సువర్ణ కల్యాణ మండపం వద్ద గాంధీ చిత్రపటానికి పవన్ కల్యాణ్ పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఏపీలో జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా పవన్ కల్యాణ్ మౌన దీక్షకు దిగారు. పవన్ కల్యాణ్‌కు సంఘీభావంగా పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్‌తోపాటు పలువురు జనసైనికులు సైతం ఈ దీక్షలో పాల్గొన్నారు. రెండు గంటలపాటు పవన్ కల్యాణ్ ఈ మౌన దీక్ష చేశారు. అనంతరం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ...రాష్ట్రంలో హింస పెట్రేగిపోతుందన్నారు. అరాచక పాలన రాజ్యమేలుతుందని ఆరోపించారు. ప్రజలకు మంచి చేయాలనే సంకల్పంతో తాను జనసేన పార్టీని స్థాపించినట్లు పవన్ కల్యాణ్ వెల్లడించారు. అంతకు ముందు గాంధీ జయంతిని పురస్కరించుకుని పవన్ కల్యాణ్ ఓ ప్రెస్‌నోట్ విడుదల చేశారు. ‘సత్యం, అహింస అనే ఆయుధాలతో యుద్దం చేయడం ఎలాగో ప్రపంచ మానవాళికి ఆచరించి చూపిన మహాత్ముడు మన గాంధీజీ. మహాత్ముడి బాటలోనే నెల్సన్ మండేలా, మార్టిన్ లూథర్ కింగ్ లాంటివారు నడిచారు. మనదేశ స్వతంత్ర పోరాటాన్నీ, గాంధీజీ జీవితాన్నీ వేర్వేరుగా చూడలేం. అహింసాయుత ప్రజా పోరుతో పరాయి పాలన నుంచి భారతదేశాన్ని విముక్తి చేశారు. బాపూజీ జయంతి సందర్భంగా మహాత్మున్ని సర్మించుకుంటూ మనస్ఫూర్తిగా అంజలి ఘటిస్తున్నాను’ అంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఓ ప్రకటన విడుదల చేశారు.‘బ్రిటిషర్ల లక్షణాలు పుణికి పుచ్చుకున్న పాలకులు రాష్ట్రంలో ఉన్నారు. ప్రజలను వర్గాలుగా విభజించి పాలించే ధోరణిలో వెళ్తున్నారు అని మండిపడ్డారు. ఓటు, సత్యాగ్రహం విలువను గాంధీజీ తెలియజెప్పారు. ఆ ఆయుధాలు ఉపయోగించి బ్రిటీష్ పాలకులను రాష్ట్రం నుంచి పంపించడం మన ధర్మంగా ప్రజలు భావించాలి’ అని పవన్ కల్యాణ్ ప్రకటనలో స్పష్టం చేశారు.