- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Breaking News : చంద్రబాబుకు మంత్రి రోజా సలహా.. అదేంటంటే..?
దిశ డైనమిక్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు హీటెక్కుతున్నాయి. దేనికైనా సై అంటే సై అని ఒకరిపై మరొకరు సవాళ్లు విసురుకుంటున్నారు. నిన్న అనంతపురం లో జరిగిన సిద్ధం సభ పై తెలుగుదేశం అధినేత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్విట్టర్ (X) వేదికగా ఓ పోస్ట్ చేశారు. ఆ పోస్ట్ లో ధైర్యం ఉంటె ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి పై తనతో భహిరంగ చర్చకు రావాలని.. ప్లేస్, టైం నువ్వే చెప్పు అని జగన్ కి సవాల్ విసిరారు.
కాగా ఈ చంద్రబాబు విసిరిన ఈ సవాల్ పై వైసీపీ నేతలు రకరాలుగా స్పందిస్తున్నారు. ఇప్పటికే కేశినేని నాని చంద్రబాబు సవాల్ కు జగన్ అవసరం లేదని.. తాను చాలని చంద్రబాబు సవాల్ సిద్ధం అని బహిరంగంగా పేర్కొన్నారు. ఇక తాజాగా నగరి మంత్రి ఆర్కే రోజా కూడా చంద్రబాబు చేసిన పోస్ట్ పై ట్విట్టర్ (X) వేదికగా స్పందించారు. వందలాది హామీలిచ్చి మ్యానిఫెస్టోను చంకలో దాచేసే చంద్రబాబు .. మీకు ఈ ఛాలెంజులు ఎందుకు? మీలాంటి మోసగాడిని ఇన్నాళ్లు మోయడమే ఎక్కువ. ఇక మీ సేవలు చాలించండి. పోయి మనవడితో ఆడుకోండి అని పోస్ట్ లో రాసుకొచ్చారు.