- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అల్లు అర్జున్ అరెస్ట్ పై స్పందించిన మృతురాలు రేవతి భర్త
దిశ,వెబ్‌డెస్క్: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) అరెస్ట్ ఘటనలో ఊహించని మలుపు చోటు చేసుకుంది. అల్లు అర్జున్ అరెస్ట్ నేపథ్యంలో తాజాగా సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన రేవతి భర్త భాస్కర్ స్పందించాడు. మీడియాతో మృతురాలు రేవతి భర్త మాట్లాడుతూ.. ఈ ఘటనకు అల్లు అర్జున్‌కు సంబంధం లేదు. అల్లు అర్జున్ అరెస్ట్ చేసిన విషయం టీవీలో చూసి తెలుసుకున్నా అన్నారు. కేసును విత్ డ్రా చేసుకుంటాను. బన్నీని విడుదల చేయాలని పోలీసులను కోరారు. అల్లు అర్జున్‌తో పాటు ఆ రోజు చాలా మంది థియేటర్‌కు వచ్చారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మరి పోలీసులు, కోర్టు ఎలా స్పందిస్తారో అనే దానిపై సర్వత్రా ఆసక్తికరంగా మారింది. ఈ నెల 4వ తేదీన రాత్రి పుష్ప-2 (Puspa-2) మూవీ బెనిఫిట్ షో సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్‌కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కుటుంబ సభ్యులు, హీరోయిన్ రష్మిక మందన్న వచ్చారు. ఈ క్రమంలో ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. థియేటర్ వద్ద తొక్కిసలాటలో ఓ మహిళ మృతిచెందగా ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే.