- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘తెలంగాణలో రేవంత్ రెడ్డి పాలన చాలా బాగుంది’.. ఏపీ మంత్రి కీలక వ్యాఖ్యలు
దిశ,వెబ్‌డెస్క్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) పై ఏపీ మంత్రి ప్రశంసలు కురిపించారు. ఈరోజు(శుక్రవారం) టీడీపీ నేత(TDP Leader), ఏపీ మంత్రి పయ్యావుల కేశవ్ హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. ఈ క్రమంలో ఆయన తెలంగాణ(Telangana)లో సీఎం రేవంత్ రెడ్డి పాలన చాలా బాగుందన్నారు. రేవంత్ రెడ్డి ఎప్పటికైన ముఖ్యమంత్రినే(Chief Minister) అవుతానని గతంలో చాలా సార్లు తనతో చెప్పారని గుర్తు చేసుకున్నారు. కేసీఆర్‌కు లొంగలేదు కాబట్టే రేవంత్ రెడ్డిని ప్రజలు ప్రత్యామ్నాయంగా (Alternatively) చూశారని ఆయన చెప్పారు. ఈ క్రమంలో మంత్రి పయ్యావుల తెలంగాణలో హైడ్రా(Telangana Hydra) పై కీలక వ్యాఖ్యలు చేశారు.పెద్దోళ్లను కొడితే కింది వాళ్ళు సంతోషిస్తారని.. హైడ్రా విషయంలో కూడా అదే జరుగుతుందన్నారు. మొదట చిన్న వాళ్లను సంతృప్తి పరచాలని చెప్పారు. తెలంగాణ ఎప్పుడు చైతన్యవంతమైన రాష్ట్రం అని తెలిపారు. తెలంగాణలో ఏదో ఒక యాక్టివిటీ ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు. ఇక ఈ మీడియా సమావేశంలో తిరుమల లడ్డూ(Tirumala Laddu) కల్తీ వివాదం పై కూడా పయ్యావుల కేశవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో గత వైసీపీ ప్రభుత్వం పై ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.