Ap News: ఏపీ పీసీబీ చైర్మన్‌గా రిటైర్డ్ ఐఏఎస్ కృష్ణయ్య నియామకం

by srinivas |
Ap News: ఏపీ పీసీబీ చైర్మన్‌గా రిటైర్డ్ ఐఏఎస్ కృష్ణయ్య నియామకం
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (Ap Pollution Control Board) చైర్మన్‌గా రిటైర్డ్ ఐఏఎస్ కృష్ణయ్య నియామకం అయ్యారు. మూడేళ్ల పాటు ఆయన పదవిలో కొనసాగున్నారు. ఈ మేరకు ప్రభుత్వం (Government) ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం సీఎస్ నీరబ్ కుమార్‌నే (Cs Neerabh Kumar) పీసీబీ చైర్మన్ బాధ్యతలు చూస్తున్నారు. అంతకుముందు మాజీ సీఎస్ సమీర్ శర్మ (Former Cs Sameer Sharma).. పీసీబీ చైర్మన్‌గా పని చేశారు. గత ప్రభుత్వంలో వైసీపీ నాయకులకు అనుకూలంగా పని చేశారనే ఆరోపణలు ఆయనపై వచ్చాయి. ఆ సమయంలో ఆయన పీసీబీ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. కూటమి ప్రభుత్వంలో సీఎస్‌గా పని చేస్తున్న నీరబ్ కుమార్‌నే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుతం నీరబ్ స్థానంలో ఆ బాధ్యతలను రిటైర్డ్ ఐఏఎస్ కృష్ణయ్యను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు విడుదల చేసింది.

కాగా విజయవాడ (Vijayawada) యనమలకుదురు పీసీబీ బోర్డుకు సంబంధించిన డ్యాక్యుమెంట్లు అవనిగడ్డ కరకట్టపై దగ్ధమైన విషయం తెలిసిందే. ఈ ఘటనలో అప్పటి పీసీబీ బోర్డులో పని చేసే డ్రైవర్ నాగరాజును అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అప్పటి బోర్డు చైర్మన్ సమీర్ శర్మ ఆదేశాలతోనే దగ్ధం చేసినట్లు నాగరాజు చెప్పారు. దీంతో సమీర్ శర్మపై ఆరోపణలు వెల్లువెత్తాయి.

Advertisement

Next Story

Most Viewed