లిక్కర్ స్కాంలో చంద్రబాబుకు రిలీఫ్: అప్పటి వరకు అరెస్ట్ చేయెద్దని ఆదేశాలు

by Seetharam |
లిక్కర్ స్కాంలో చంద్రబాబుకు రిలీఫ్: అప్పటి వరకు అరెస్ట్ చేయెద్దని ఆదేశాలు
X

దిశ , డైనమిక్ బ్యూరో : లిక్కర్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడికి భారీ ఊరట లభించింది. ఈ కేసులో మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి కొల్లు రవీంద్రలపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. లిక్కర్ స్కాం కేసుపై సుదీర్ఘ వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. అదే సందర్భంలో లిఖిత పూర్వక వాదనలు సమర్పించాలని కోర్టును ఆదేశించిన సంగతి తెలిసిందే. హైకోర్టు ఆదేశాల మేరకు సోమవారం చంద్రబాబు, సీఐడీ తరపు న్యాయవాదులు లిఖిత పూర్వక వాదనలు సమర్పించారు. దీంతో హైకోర్టు న్యాయమూర్తి తదుపరి ఆదేశాలు వచ్చే వరకు చంద్రబాబు నాయుడు, కొల్లు రవీంద్రలను అరెస్ట్ చేయవద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను కొనసాగించాలని సూచించింది. అనంతరం తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు హైకోర్టు ధర్మాసనం ప్రకటించింది. తీర్పు వెల్లడించే వరకు ఎలాంటి తొందరపాట చర్యలు తీసుకోవద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

Advertisement

Next Story

Most Viewed