పిఠాపురంలో బాలికపై అఘాయిత్యం.. డిప్యూటీ సీఎం సీరియస్

by Shiva |   ( Updated:2024-10-08 15:14:53.0  )
పిఠాపురంలో బాలికపై అఘాయిత్యం.. డిప్యూటీ సీఎం సీరియస్
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లోని పిఠాపురం(Pitapuram)లో ఓ మైనర్ బాలికకి మద్యం తాగించి అత్యాచారం చేసిన ఘటన రాష్ట్రంలో కలకలం సృష్టిస్తుంది. ఇందిరానగర్ మాజీ కౌన్సిలర్ భర్త జాన్ బాబు.. మైనర్ బాలికకు మద్యం తాగించి ఆపై అత్యాచారం చేశాడు. ఈ వ్యవహారంలో ఓ మహిళ కూడా అతనికి సహాయం చేసినట్లు బాధితురాలి కుటుంబ సభ్యులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. సోమవారం రాత్రి బలవంతంగా ఆటో ఎక్కించి డంపింగ్ యార్డ్ దగ్గరకు తీసుకెళ్లిన మాజీ కౌన్సిలర్.. అక్కడే బాలికకు బలవంతంగా మద్యం తాగించి అత్యాచారం చేశాడు. కాగా ఈ ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. మైనర్ బాలికపై అఘాయిత్యం అమానుషం.ఈ చర్యను ప్రతి ఒక్కరు ఖండించాలి. బాలికలకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించాము, బాలిక కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటాం. అలాగే ఈ అగాయిత్యానికి పాల్పడిన నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు.

Advertisement

Next Story