Nellore Central Jail: నెల్లూరు సెంట్రల్ జైలులో రాఖీ వేడుకలు

by Naresh |   ( Updated:2022-08-12 11:19:15.0  )
Raksha Bandhan Celebrations in Nellore Central jail
X

దిశ, ఏపీ బ్యూరో : Raksha Bandhan Celebrations in Nellore Central Jail| దిశా ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం నెల్లూరులోని సెంట్రల్ జైలులో రాఖీ వేడుకలు ఘనంగా జరిగాయి. దిశా ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ నేషనల్ చైర్మన్ బి.వి.రాజు ఆదేశాల మేరకు రాఖీ పండుగ సందర్భంగా ఖైదీలకు రాఖీలు కట్టి, స్వీట్ పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఫౌండేషన్ స్టేట్ సెక్రటరీ నీడిగుంట అరుణ మాట్లాడుతూ ఈ సమాజం బాగుండాలంటే ప్రతీ ఖైదీ సోదరుడు క్షమాగుణం కలిగి ఉండాలి అని సూచించారు. ప్రతీ ఖైదీకి కుటుంబం ఒకటి ఉంటుందని గుర్తెరిగి మంచి అలవాటుతో మెలుగుతూ ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రెసిడెంట్ భీమతాటి సారిక, కేంద్ర కారాగార పర్యవేక్షణాధికారి కె. రాజేశ్వరరావు, అడిషనల్ సూపరెండెంట్ ఎమ్.మహేష్ బాబు, డిప్యూటీ సూపరెండెంట్ ఎ.బి. కాంత రాజ్, వైద్యాధికారులు, జైలర్ వి. రమేష్, డిప్యూటీ జైలర్లు, జైలు ఖైదీలు తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: కోడలి తల నరికేసిన అత్త

Advertisement

Next Story

Most Viewed