- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చంద్రబాబు, పవన్ భేటీపై మంత్రి విడదల రజినీ ఫైర్
X
దిశ, వెబ్‌డెస్క్: ఏపీ మాజీ సీఎం చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ భేటీపై మంత్రి విడదల రజినీ విమర్శలు గుప్పించారు. చంద్రబాబు వల్ల చనిపోయిన మృతుల కుటుంబాలను పరామర్శించాల్సిన పవన్ కల్యాణ్.. వెళ్లి చంద్రబాబునే పరామర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. చంద్రబాబు, పవన్ పేర్లు మాత్రమే వేరని.. మనుషులు ఇద్దరు ఒక్కటేనని ఎద్దేవా చేశారు. జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెం 1 పేద ప్రజలను కాపాడుతుందని తెలిపారు. కాగా, హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసంలో పవన్ ఆయనతో భేటీ అయిన సంగతి తెలిసిందే. వీరద్దరి భేటీ ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వైసీసీ నేతలు ఈ భేటీపై విమర్శల వర్షం కురిపిస్తుండగా.. టీడీపీ, జనసేన నేతలు సైతం అదే రీతిలో రిప్లై ఇస్తుండటంతో ఏపీ పాలిటిక్స్ హీటేక్కాయి.
Advertisement
Next Story