చిత్తూరు, తిరుపతి రైల్వే స్టేషన్లకు మహర్దశ

by srinivas |
చిత్తూరు, తిరుపతి రైల్వే స్టేషన్లకు మహర్దశ
X

దిశ, తిరుపతి: రాష్ట్రంలో విశాఖపట్నం, విజయవాడ సహా 72 రైల్వే స్టేషన్లను రైల్వే శాఖ అభివృద్ధి చేయనుంది. ఇందులో భాగంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుపతి, చిత్తూరు రైల్ వే స్టేషన్లను కేంద్రం ఎంపిక చేసింది. కేంద్ర ప్రభుత్వం ఇటీవలి బడ్జెట్‌లో ప్రవేశపెట్టిన 'అమృత్‌ భారత్‌ స్టేషన్స్‌' పథకం కింద దేశంలో 1,275 రైల్వే స్టేషన్లను ఆధునికీకరించాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ఈ పథకం కింద రైల్వే స్టేషన్లలో 53 రకాల మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయనుంది. ప్రతి స్టేషన్‌ అభివృద్ధికి ప్రత్యేక మాస్టర్‌ ప్లాన్‌ రూపొందించనుంది. రాష్ట్రంలో ఎంపిక చేసిన స్టేషన్ల అభివృద్ధికి త్వరలోనే మాస్టర్‌ ప్లాన్లు రూపొందించేందుకు నిపుణుల కమిటీలను నియమిస్తామని రైల్వే శాఖ వర్గాలు తెలిపాయి. అనంతరం బడ్జెట్‌ను రూపొందించి దశల వారీగా పనులు చేపట్టనున్నారు.

Advertisement

Next Story

Most Viewed