- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Breaking: దాంపత్య జీవితం సుఖంగా ఉండాలంటే ఏం చెయ్యాలో చెప్పిన రాచమల్లు
దిశ డైనమిక్ బ్యూరో: నిన్న మీడియా సమావేశంలో మాట్లాడిన ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో అయన పెద్ద కుమార్తె వివాహం ఆమె ప్రేమించిన యువకుడితో జరిపించిన విషయం అందరికి తెలిసిందే. అయితే నిన్న మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఆయన మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
తాను అందంగా ఉంటానాని.. అయితే తన అల్లుడిలో అందం తనకు కనిపించలేదని..తన కూతురికి కనిపించిందని పేర్కొన్నారు. బాహ్య సౌదర్యం, అంతర్గత సౌందర్యం రెండు ముఖ్యమని తెలిపారు. అయితే ఆ యువకుడికి తనకు పరిచయం లేదు కనుక తనకి ఆ అబ్బాయిలోని అంతర్గత సౌందర్యం గురించి తెలియదన్నారు.
ఇక తన కూతురు చెప్పిన తరువాత అబ్బాయి గురించి విచారించానని.. ఆ విచారణలో అబ్బాయి మెకానిక్ కొడుకని.. చిన్న ఫ్యామిలీ.. మధ్యతరగతి కుటుంబం అని తెలిసిందని తెలిపారు. ఎవరు ఎన్ని చెప్పిన.. కులానికి, మతానికి , డబ్బుకి, అందానికి, ఐఏఎస్ , ఐపీఎస్ ఇలా దేనికి ప్రాధాన్యత ఇచ్చిన చివరికి కూతురికి ఇష్టం లేనప్పుడు ఏం చేయలేమని పేర్కొన్నారు.
అన్నింటికంటే ముఖ్యంగా వధువుకు వరుడు నచ్చాలి.. దాంపత్య జీవితం సుఖంగా ఉండాలి అంటే అమ్మాయికి అబ్బాయి, అబ్బాయికి అమ్మాయి నచ్చాలని తెలిపారు. ఇక తాను కూడా తన కూతురికి నచ్చచెప్పడానికి ప్రయత్నించానని.. మన స్థాయికి తగిన వారు కారని.. ఆ అబ్బాయిని చేసుకుంటే రేపు నీ చెల్లిళ్లతో అంత కంఫర్ట్ గా ఉండలేవని చెప్పినట్లు పేర్కొన్నారు.
ఒకర్ని ప్రేమించి మరొకర్ని పెళ్లి చేసుకోవడం కరెక్ట్ కాదని.. తాను పెళ్లికి ఒప్పుకోకుంటే ఆ అబ్బాయిని చేసుకుంటానని.. లేకుంటే జీవితాంతం తన కూతురుగా ఇంట్లో ఉండిపోతానని చెప్పిందని తెలిపారు. ఆరు సంవత్సరాలు ఈ చర్చ జరిగిన తరువాత ఆడపిల్ల పెళ్లి కాకుండా ఒంటరిగా ఉండడం మంచిది కాదని అందుకే తన కూతురు ఇష్టపడిన వాడితోనే పెళ్లి చేశానని తెలిపారు.
కాగా ప్రస్తుతం రాజమల్లు వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఆ వీడియో చూసిన వాళ్లంతా రాజమల్లు పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.