Breaking: పౌరుషం అనేది మంచి చేయడంలో ఉండాలి చెడులో కాదు.. రాచమల్లు

by Indraja |
Breaking: పౌరుషం అనేది మంచి చేయడంలో ఉండాలి చెడులో కాదు.. రాచమల్లు
X

దిశ డైనమిక్ బ్యూరో: మీడియాకి రాచమల్లు ఇచ్చిన ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూ లో రాయలసీమ గడ్డపై పోరుషం కనిపిస్తోంది ఎవరికైనా.. అయితే మీలో ఆ పౌరుషం లేదని.. ఉంటె కూతురి పెళ్లి విషయంలో వేరేలా ఉండేదేంమో అని రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డిని యాంకర్ ప్రశ్నించారు. ఆ ప్రశ్నకు సమాధానంగా తనలోనూ పౌరుషం ఉందని.. అయితే పోరుషం అనేది మంచిచేయడంలో ఉండాలి చెడు చేయడంలో కాదు అని పేర్కొన్నారు.

చెడు చేసేదాన్ని పౌరుషం అనరని దాన్ని పౌరుషహీనత అంటారని తెలిపారు. మంచిచెయడం కోసం జీవితాన్ని త్యాగం చేస్తే దాన్ని పౌరుషం అంటారని వెల్లడించారు. తన కూతురు కోసమో.. లేక ఎదుటి వారి కోసమో తన జీవితాన్ని త్యాగం చేస్తే అది పౌరుషం అని.. అలాకాకుండా తన సుఖం కోసం ప్రేమించుకున్న తన కూతురిని అల్లుడిని చంపితే అది పౌరుష హీనత అని తెలిపారు.

మంచి చేసేదానికి, త్యాగం చేసేదానికి ధర్మమార్గాన్ని ఎన్నుచుకునేదానికి, అందులో పడ్డ కష్ఠాల కోసం ఓ కృత నిశ్చయంతో ప్రయాణం చేసేదే పౌరుషం.. అదే రాయలసీమ పౌరుషం అని వెల్లడించారు. ఇక అదే కడప మట్టిలో ఉండే గొప్పతనం అని తెలిపారు. ఇక అలానే రాజకీయాలకు, ప్రజలకు సేవ చేసేందుకు వారసత్వం కరెక్ట్ కాదని తెలిపారు.

ప్రజలకు సేవ చెయ్యాలని కోరిక, ఓపిక, సమర్ధత ఉన్న వాళ్ళే రాజకీయాలకు అర్హులని.. రాజకీయం అంటే వడ్డించిన విస్తరి కాదని.. ప్రజలకు సేవ చెయ్యాలనే కోరిక, ఓపిక, సమర్ధత ఉంటె ఎవరు అండగా నిలవాల్సిన అవసరం లేదని.. ప్రజాసేవ చెయ్యాలనే కోరిక, ఆ సమర్ధత ఉంటేనే రాజకీయాల్లోకి రావాలని.. తన కొడుక్కి కూడా అదే చెప్పానని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed