- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
'ఆసియాలోనే అతిపెద్ద బస్టాండ్‌గా పులివెందుల'

దిశ, డైనమిక్ బ్యూరో : ఆసియాలోనే అతి పెద్ద బస్టాండ్‌గా పులివెందుల ఆర్టీసీ బస్టాండ్‌ను తీర్చిదిద్దుతున్నామని ఆర్టీసీ చైర్మన్ మల్లిఖార్జునరెడ్డి అన్నారు. రూ.34 కోట్ల వ్యయంతో ఈ బస్టాండ్ నిర్మాణం చేపట్టినట్లు వెల్లడించారు. పులివెందుల ఆర్టీసీ బస్టాండ్‌లో జరుగుతున్న పనుల తీరును ఆర్టీసీ చైర్మన్ మల్లిఖార్జున రెడ్డి సోమవారం పరిశీలించారు. పనులు జరుగుతున్న తీరుపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. బస్టాండ్‌లో ఏర్పాటు చేసిన పనులను ఈడీ కే గోపీనాథ్ రెడ్డితో కలిసి పరిశీలించారు. అనంతరం ఆర్టీసీ చైర్మన్ మల్లిఖార్జునరెడ్డి మాట్లాడుతూ... ఆసియాలోనే అతి పెద్ద బస్టాండ్‌గా పులివెందులను తీర్చిదిద్దడం ఎంతో సంతోషకరంగా ఉందన్నారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో చేపట్టిన పనులు చివరి దశకు వచ్చినట్లు చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేతుల మీదుగా ఈ బస్టాండ్‌ను త్వరలోనే ప్రారంభించబోతున్నట్లు ఆర్టీసీ చైర్మన్ మల్లిఖార్జునరెడ్డి స్పష్టం చేశారు.