- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
హోలీ అంటూ.. విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించిన ప్రిన్సిపాల్!

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం ప్రజలు హోలీ(Holi) వేడుకలను ఘనంగా నిర్వహించారు. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ రంగులు చల్లుకుంటూ ఉత్సవాలు జరుపుకున్నారు. ఈ క్రమంలో హోలీ సందర్భంగా ఓ కాలేజీ ప్రిన్సిపాల్ విద్యార్థినులతో అనుచితంగా ప్రవర్తించిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh )లోని శ్రీ సత్యసాయి జిల్లా కదిరి అమృతవల్లి మహిళా డిగ్రీ కళాశాల(Women's Degree College)లో హోలీ సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ వెంకటపతి విద్యార్థినిలతో కలిసి హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలో కళాశాల ప్రిన్సిపాల్(College Principal) విద్యార్థినిలపై నీళ్లు చల్లుతూ పరిగెత్తించాడు. అంతటితో ఆగకుండా ఎత్తుకొని వెళ్లి బురదలో పడేసి దొర్లించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరలవుతోంది. దీనిపై తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు అందించారు. దీంతో పోలీసులు(Police) కళాశాల ప్రిన్సిపాల్‌ను అదుపులోకి తీసుకొని ఘటన పై విచారిస్తున్నారు.