సీఎం జగన్‌లా ప్రధాని ఓటు అడగలేకపోయారు..మంత్రి బొత్స సంచలన వ్యాఖ్యలు

by Jakkula Mamatha |   ( Updated:2024-05-21 15:27:44.0  )
సీఎం జగన్‌లా ప్రధాని ఓటు అడగలేకపోయారు..మంత్రి బొత్స సంచలన వ్యాఖ్యలు
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ఇక రాష్ట్రంలో ఎవరు అధికారంలోకి వస్తారనే చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఎవరికి వారే గెలుపు తమదే అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. కానీ ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే దానిపై జూన్ 4వ తేదీన క్లారిటీ రానుంది. ఈ నేపథ్యంలో మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ వైసీపీ పై చేసిన వ్యాఖ్యలపై మంత్రి బొత్స ఘాటుగా స్పందించారు. ప్రశాంత్ కిషోర్ ఓ క్యాష్ పార్టీ అని మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శలకు దిగారు. ఆయనతో వన్ టైమ్ వ్యవహారం అనుకొని..తర్వాత వదిలేసినట్లు చెప్పారు. ప్రశాంత్ అయినా..ఐ-ప్యాక్ అయినా తాత్కాలికమేనని తెలిపారు. వైసీపీ శాశ్వతమని..ఈ ఎన్నికల్లో 175 అసెంబ్లీ సీట్లకు 175 వైసీపీ సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పరిపాలన చూసి ఓటెయ్యాలని సీఎం జగన్‌లా ప్రధాని మోడీ కూడా ఓటు అడగలేక పోయారని అన్నారు.

Advertisement

Next Story