- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వైసీపీ కోసమే వాలంటీర్లు పని చేస్తారు.... ఏం చేస్తారో చేసుకోండి...!
దిశ, వెబ్ డెస్క్: ఏపీలో మే 13న ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. అయితే ఎన్నికల విధుల్లో వాలంటీర్లను నిర్వహించొద్దని ఎన్నికల సంఘం అదేశించింది. అంతేకాదు ఎన్నికల ప్రచారంలోనూ పాల్గొనవద్దని సూచించింది. అయితే వార్డు వాలంటీర్లు అవేమీ పట్టించుకోవడంలేదు. అధికార పార్టీకి అనుకూలంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. దీంతో ఎన్నికల అధికారులకు ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ మేరకు వాలంటీర్లపై ఈసీ చర్యలు తీసుకుంటోంది.
ఈ నేపథ్యంలో అద్దంకి ఎమ్మెల్యే అభ్యర్థి హనిమ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కోసమే వార్డు వాలంటీర్లు పని చేస్తారని చెప్పారు. అవసరమైతే వారితో రాజీనామా చేయించి ప్రత్యక్ష రాజకీయాల్లో తిప్పుకుంటామని, ఏం చేస్తారో చేసుకోండంటూ బెదిరించారు. వైసీపీ కార్యకర్తలు, వాలంటీర్లకు ఏదైనా జరిగితే ఒక్కొక్కరి అంతు చూస్తామని హెచ్చరించారు. దీంతో ఆయనపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హనిమిరెడ్డి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకు ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Read More..