- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Yerragondpalem: పేదల బియ్యం పక్కదారి.. పట్టించుకోని అధికారులు
దిశ, ఎర్రగొండపాలెం: దోర్నాల మండలం పెద్ద బొమ్మలాపురం రేషన్ షాప్ నెంబర్ 23లో నాలుగేళ్లుగా తంబు లేకుండానే బియ్యం పంపిణీ చేస్తున్నారు. గ్రామంలో తలారి పద్మను ఇంఛార్జిగా ఉంచి వైసీపీ నాయకులు తాపీరెడ్డి చెంచు రెడ్డి, చందలూరు మల్లికార్జున ఈ దందాకు పాల్పడుతున్నారు. ఇంట్లోనే రేషన్ బియ్యాన్ని దించుకొని, కార్డుదారుల పేర్లు పేపర్‌లో రాసి, వారి వేలిముద్రలు తీసుకొని ఒక కిలో పది రూపాయలు చొప్పున డబ్బులు ఇచ్చి పంపిస్తున్నారు.
ఇలా 250 బస్తాల రేషన్ బియ్యాన్ని రాత్రి సమయంలో తరలించారు. రేషన్ షాపు ఒకచోట సదరు బియ్యం దిగుమతి చేసుకునేది మరోచోట. ఈ పోస్ట్ మిషన్‌లో ముందుగానే బియ్యం పంపిణీ చేసినట్లు నమోదు చేసి రేషన్ బియ్యాన్ని గుట్టు చప్పుడు కాకుండా మరో ఇంట్లో నిల్వ ఉంచి రాత్రి సమయంలో తరలిస్తున్నారు. గతంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన బియ్యాన్ని కూడా గ్రామంలో ఒక వైసీపీ నాయకుడు ఇంట్లో నిల్వ ఉంచారు. ఎవరికి ఇవ్వకుండా రాత్రి సమయంలో ఇతర ప్రాంతాలకు తరలించారు. దీంతో దోర్నాల ఎమ్మార్వో వేణుగోపాలరావుకు గ్రామస్తులు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. పెద్ద బొమ్మలాపురం వీఆర్వో మోహన్ రావుతో పాటు తలారి పద్మను సస్పెండ్ చేసి రేషన్ బియ్యం దందాకు అడ్డుకట్ట వేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.