- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Breaking: ఒంగోలు వైసీపీ ఎంపీ అభ్యర్థి ఖరారు.. టీడీపీ వైపు మాగుంట..!
దిశ, వెబ్ డెస్క్: ఒంగోలు రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. ఈ పార్లమెంట్ నియోజకరవర్గం అభ్యర్థిపై వైసీపీ అధిష్టానం కసరత్తు దాదాపు పూర్తి అయినట్లు తెలుస్తోంది. ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని రంగంలోకి దింపేందుకు సిద్ధమైంది. ఇప్పటికే ఆయన పేరును సీఎం జగన్ మోహన్ రెడ్డి దాదాపు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఇక ప్రకటనే తరువాయి భాగంగా ఉంది. ఇప్పటికే ఐదు జాబితాలు విడుదల చేసిన వైసీపీ.. ఇప్పుడు తదుపరి జాబితాపై దృష్టి పెట్టింది. ఈ జాబితాలో ఒంగోలు ఎంపీ స్థానానికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరును పొందపర్చారని తెలుస్తోంది.
ఇక ఒంగోలు సిట్టింగ్ ఎంపీగా ఉన్న మాగుంట శ్రీనివాసుల రెడ్డికి ఇప్పటికే సీఎం జగన్ టికెట్ నిరాకరించిన విషయం తెలిసిందే. అయితే మాగుంటకు మళ్లీ అవకాశం ఇవ్వాలని ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి తీవ్రంగా ప్రయత్నం చేశారు. కాని వైసీపీ అధిష్టానం బాలినేనికి సీటు ఇచ్చేందుకు సుముఖుత చూపలేదు. పలుమార్లు చర్చించినప్పటకీ సీటు ఇచ్చేది లేదని అటు సీఎం జగన్ సైతం బాలినేనికి తేగెసి చెప్పారట. ఇక చేసేందేమీ లేక జగన్ నిర్ణయానికే బాలనేని లొంగిపోయినట్లు తెలుస్తోంది. ఈ పరిమాణంతో మాగుంట శ్రీనివాసుల రెడ్డి చూపు మళ్లీ టీడీపీ వైపునకు టర్న్ అయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆయన కుటుంబ సభ్యులు టీడీపీ నేతలతో టచ్‌లోకి వెళ్లారని ప్రచారం జరుగుతోంది.
కాగా మాగుంట శ్రీనివాసుల రెడ్డి 1998లో కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. ఒంగోలు ఎంపీగా మూడు సార్లు గెలిచారు. 2009లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. రాష్ట్ర విభజన తర్వాత 2014లో టీడీపీలో చేరి ఒంగోలు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. అయినా సరే చంద్రబాబు స్థానిక సంస్థల తరపున ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చారు. అయితే 2019 ఎన్నికల సమయంలో టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరి ఒంగోలు ఎంపీ పోటీ చేసి గెలుపొందారు. తాజాగా మరికొన్ని నెలల్లో ఎన్నికలు రానుండటంతో సీఎం జగన్ చేయించిన సర్వేలో మాగుంటకు నెగిటివ్ రావడంతో సీటు నిరాకరించారు. దీంతో మాగుంట శ్రీనివాసులు రెడ్డి మళ్లీ టీడీపీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.