Breaking: చెట్టును ఢీకొన్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు

by srinivas |
Breaking: చెట్టును ఢీకొన్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు
X

దిశ, వెబ్ డెస్క్: ప్రకాశం జిల్లా డోర్నాల సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. కర్ణాటక ప్రైవేటు ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. శ్రీశైలం నుంచి కర్ణాటక వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదంపై ఆరా తీశారు. బస్సు అతివేగం వల్లే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా అంచనా వేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed