- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
గ్రామంలో పోలీస్ కవాతు.. కారణం ఇదే
దిశ, అన్నవరం: రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రజల్లో మనోధైర్యాన్ని నింపేందుకు పోలీసులు కవాతు నిర్వహించారు. ఈ ఘటన కాకినాడ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఈ రోజు (మంగళవారం) కాకినాడ జిల్లాలోని అన్నవరం గ్రామంలో పోలీసు కవాతు నిర్వహించారు. ఎన్నికల్లో ఎటువంటి ప్రలోభాలకు లోనుకాకుండా తమ ఓటు హక్కును ప్రశాంతంగా వినియోగించుకోవాలని అన్నవరం ఎస్సై కిషోర్ ప్రజలకు పిలుపునిచ్చారు.
ఎన్నికల్లో భాగంగా అన్నవరం చేరుకున్న కేంద్ర సాయుధ బలగాలతో గ్రామంలో కవాతు నిర్వహించి ఓటర్లలో మనోధైర్యాన్ని నింపారు. ఎవరైనా అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలానే ఎన్నికల సమయంలో ఎటువంటి కేసులు నమోదైనా ఆ కేసులు జీవితాంతం వెంటాడుతూనే ఉంటాయని ఎస్ఐ పేర్కొన్నారు. బంగారు భవిష్యత్తు కలిగిన యువకులు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడకుండా ఉండాలని.. రానున్న కాలంలో మంచి ఉద్యోగాలు సంపాదించుకునేలా ఉన్నతమైన భవిష్యత్తుకు బంగారు బాట వేసుకోవాలని కోరారు.