Gold Theft: భారీ చోరీ.. రంగంలోకి ఆరు స్పెషల్ టీమ్స్

by srinivas |
Gold Theft: భారీ చోరీ.. రంగంలోకి ఆరు స్పెషల్ టీమ్స్
X

దిశ, వెబ్ డెస్క్: పోలీసులకే దొంగ సవాల్ విసిరారు. దర్జాగా రాష్ట్రానికి వచ్చి సినీ ఫక్కీలో చోరీ చేసి ఎటో వెళ్లిపోయారు. దీంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామని చెప్పారు. ఈ ఘటన ఎన్టీఆర్ జిల్లాలో జరిగింది.


కాగా హైదరాబాద్ నుంచి నలుగురు వ్యక్తులు 6.5 కిలోల బంగారం డెలివరీ చేసేందుకు కారులో నందిగామ వచ్చారు. అయితే డైవర్ మిగిలిన వ్యక్తులను బురిడీ కొట్టించారు. చాయ్ తాగే సమయంలో బంగారం తీసుకుని వెళ్లిపోయారు. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు.. నిందితుడు జితీశ్‌ కోసం నాగ్ పూర్, జబల్‌పూర్, హైదరాబాద్‌లో ముమ్మరంగా గాలిస్తున్నారు. అయితే బంగారాన్ని తీసుకుని వచ్చిన కారులో జితీశ్ కొంతదూరం వరకూ వెళ్లారు. కారుకు జీపీఎస్ ట్రాక్ ఉండటంతో మధ్యలో కారును వదిలేసి పారిపోయారు. అయితే నందిగామ వద్ద ఓ హోటల్‌లో నిందితుడు టీ తాగిన విజువల్స్ స్థానిక సీసీ పుటేజ్ లో రికార్డయ్యారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Next Story