పవన్‌ను ఓడించేందుకు భారీ స్కెచ్.. పిఠాపురం ఎమ్మెల్యేకు సీఎం పిలుపు

by srinivas |
పవన్‌ను ఓడించేందుకు భారీ స్కెచ్.. పిఠాపురం ఎమ్మెల్యేకు సీఎం పిలుపు
X

దిశ, వెబ్ డెస్: పిఠాపురం నుంచి ఈసారి జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఇప్పుడు అందరి చూపు పిఠాపురం వైపే ఉంది. ఎందుకంటే పవన్ కల్యాణ్ సినిమా స్టార్, రాజకీయ బ్యాక్ గ్రౌండ్ ఉన్న వ్యక్తి కాదు. రాజకీయాల్లోకి పదవుల కోసం ప్రశ్నించడానికే వచ్చానని చాలా సార్లు బహిరంగంగా చెప్పారు. అయితే జనసేన పార్టీ పెట్టి దాదాపు 10 ఏళ్లు అవుతోంది. అయితే 2014 ఎన్నికల్లో పోటీ చేయలేదు. అప్పుడు టీడీపీకి మద్దతు ఇచ్చారు. 2019 ఎన్నికల్లో జనసేన రంగంలోకి దిగింది. అయితే ఆయన రెండు చోట్లపోటీ చేసి ఓడిపోయారు. జనసేన నుంచి పోటీ చేసిన రాపాక వరప్రసాద్ తప్ప మిగిలిన ఎవరూ గెలవలేదు. దాంతో ఈ ఎన్నికల్లోనైనా ఆయనతో పాటు పార్టీ నాయకులు గెలుస్తారా అని జనసేన పార్టీ శ్రేణులు, పవన్ అభిమానులు ఎదురు చూస్తున్నారు. దీంతో రాజకీయ పరంగా, సామాజికవర్గం పరంగా పిఠాపురం నుంచి పోటీ చేస్తే గెలుపు ఖాయమనే భావించారు. ఈ మేరకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురం అసెంబ్లీ నుంచి బరిలో దిగుతున్నారు. దీంతో ఆ నియోజకవర్గం రాష్ట్రంలోనే అత్యంత ప్రాధాన్యత చోటు చేసుకున్న స్థానంగా నిలిచింది.


మరోవైపు గత ఎన్నికల్లో పిఠాపురం నుంచి వైసీపీ తరపున పోటీ చేసిన పెండెం దొరబాబు ఎమ్మెల్యేగా గెలిచారు. ఈసారి పవన్ కల్యాణ్ పిఠాపురం నుంచి ఎమ్మెల్యే పోటీ చేస్తుండటంతో అటు వైసీపీ అధినేత జగన్ ఈ స్థానాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎలాగైనా సరే పవన్ కల్యాణ్‌పై పై చేయి సాధించాలని వ్యూహాలు రచిస్తున్నారు. అంతేకాదు పవన్ కల్యాణ్‌పై మహిళను రంగంలోకి దింపి తానేంటో నిరూపించుకోవాలని జగన్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా కాకినాడ ఎంపీగా ఉన్న వంగా గీతను రంగంలోకి దింపుతున్నారు. పిఠాపురం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న పెండెం దొరబాబును ప్రస్తుతానికి పక్కన బెట్టేశారు. అయితే దొరబాబును వ్యతిరేకత రాకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. నియోజకవర్గంలో అసమ్మతి వినిపించకుండా చేసేందుకు ప్రణాళికలు తయారు చేస్తున్నారు. ఎమ్మెల్యే పెండెం దొరబాబును బుజ్జగించి వంగా గీతకు సహకరించే విధంగా కసరత్తులు చేపట్టారు.


ముందుగా పెండెం దొరబాబును తన కార్యాలయానికి పిలిచి మాట్లాడాలని కబురు పంపారు. దీంతో గురువారం సాయంతం సీఎం జగన్‌తో ఎమ్మెల్యే పెండెం దొరబాబు భేటీ కానున్నారు. ఈ భేటీలో వంగా గీత వర్గంతో సమన్వయం చేసుకునేలా దొరబాబును ఒప్పించనున్నారు. మరోవైపు పార్టీలో చేరికలకు ఎమ్మెల్యేకు సమాచారం ఇవ్వకపోవడంపైనా సీఎం జగన్ ఆరా తీశారు. వంగా గీత, ఎమ్మెల్యే పెండెం దొరబాబు వర్గాలు కలిసి పని చేయాలని సీఎం జగన్ సూచించారు. ఈ మేరకు పెండెం దొరబాబుతో భేటీ అయి వచ్చే ఎన్నికలపై దిశా నిర్దేశం చేయనున్నారు. ప్రధానంగా పవన్ కల్యాణ్‌‌పై గెలిచేందుకు వైసీపీ నాయకులంతా ఒకటిగా పని చేయాలని పెండెం దొరబాబుకు సీఎం జగన్ సూచించనున్నారు. మరి కాసేపట్లో వీరి భేటీ ప్రారంభం కానుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Advertisement

Next Story