AP News:అక్రమాల్లో టాప్..వెలుగు చూస్తున్న పిన్నెల్లి సరికొత్త అక్రమాలు?

by Jakkula Mamatha |
AP News:అక్రమాల్లో టాప్..వెలుగు చూస్తున్న పిన్నెల్లి సరికొత్త అక్రమాలు?
X

దిశ ప్రతినిధి,నరసరావుపేట:పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈ పేరు వింటేనే అక్రమార్కుడు, దౌర్జన్యలు చేయించడం, ప్రత్యర్థి పార్టీ వారిపై అక్రమ కేసులు బనాయించి హింసించటం, అనుచరుల తో ఆస్తులు అపహరింపచేయటం, అక్రమ ఆదాయం గడించడంలో దిట్ట అని రాష్ట్రంలో పేరు పడ్డ ప్రముఖుడు. జగన్ పాలనలో మాచర్ల నియోజకవర్గంలో పిన్నెల్లి బ్రదర్స్ ఆధ్వర్యంలో జరగని నేరం లేదు. సామాన్య ప్రజలు గజ గజ వణికిపోయారు. వణకటం ఇప్పుడు పిన్నెల్లి బ్రదర్స్ వారి అనుచరులలో ప్రారంభమైంది. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత పిన్నెల్లి బ్రదర్స్‌లో రామకృష్ణారెడ్డి పలుకేసుల్లో నిందితుడై జైల్లో ఉన్నారు. ఆయన తమ్ముడు, ప్రధాన అనుచరులు 2 నెలలుగా పరారి లో ఉన్నారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అధికారం కోల్పోయిన తర్వాత ఆయన చేసిన చేయించిన కోట్ల అక్రమాలు వెలుగు చూస్తున్నాయి.

2019 ప్రాంతంలో వెల్దుర్తి మండలం లోని వెల్దుర్తి - గంగిరెడ్డిపల్లె లో మధ్య 3 కి. మీ.మెటల్ రోడ్డు వేశారు.ఈ రోడ్డు పని విలువ 28 లక్షలు. ఇది ఐటీడీఏ పరిధిలో జరిగిన రోడ్డు నిర్మాణం జరిగింది. ఈ పనికి సంబంధించిన నిధులు 2022 లో విడుదల అయ్యాయి. ఇంకేముంది అప్పటి ఎంఎల్ఏ పిన్నెల్లి మెటీరియల్ సప్లయర్స్ కు బిల్లు ఇవ్వొద్దు డ్రా చేసి నాకు తెచ్చి ఇవ్వండని అధికారులను ఆదేశించారు. సంభందిత అధికారులు చెప్పిన వెంటనే డబ్బులు డ్రా చేసి ఎంఎల్ఏ గారికి ఇచ్చి పంపారు. ఇది పూర్తిగా అక్రమం అయినా పిన్నెల్లి సార్ చెప్పారు. కాబట్టి అధికారులు అడ్డదిడ్డంగా వ్యవహరించారు.

విషయం తెలుసుకున్న మెటీరియల్ సప్లయర్స్ రామాంజనేయ రెడ్డి తన కు బిల్లు ఇప్పించాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. విచారణ ఆరంభమైంది. డబ్బులు డ్రా చేసి ఇచ్చిన అధికారుల్లో చలనం ప్రారంభమైంది. తాము ఇరుక్కున్నది కాక డబ్బులు చెల్లించవలసి వస్తుంది అని హడలిపోయి అప్పుడు ఎం.పి.డి. ఒ.గా ఉన్న వికలాంగురాలైన మహిళా అధికారిణి మాజీ ఎంఎల్ఏ పిన్నెల్లి నీ కలిసి రామంజి రెడ్డికి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుంటే పురుగుమందు తాగి ఇక్కడే ఆత్మ హత్య చేసుకుంటానని చెప్పటంతో జైలుకు పోయే హడావుడిలో వున్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వణుకి పోయి వెంటనే డబ్బులు ఇవ్వమని తన కుటుంబ సభ్యులకు చెప్పారట. ఐతే సదరు అధికారిణి ఆ డబ్బు నేను తీసుకొని వేరే వారి చేత సప్లయర్ కు పంపాలని చెప్పి వెళ్లి పోయింది.

మాజీ ఎమ్మెల్యే ఇచ్చిన డబ్బులు తీసుకున్న ప్రస్తుతం అధికారులు శాఖ అకౌంట్‌లో వేశారు. ఐతే వడ్డీ తో సహా చెల్లించాలని షరతు విధించారు. వ్యవహారం మొదటికొచ్చింది. డబ్బులు ఇవ్వాల్సిన మాజీ పిన్నెల్లి జైల్లో ఉన్నారు. బ్రదర్ పరారీలో ఉన్నారు. ఇంటికి వెళ్లి చెపితే ఏం అంటారో అనే భయంతో సంభందిత అధికారులకు ఉకొట్టు మిత్తాడుతున్నారు. ఇదే తరహాలో పిన్నెల్లి కోట్ల రూపాయలు ఎన్ ఆర్ జి ఇ ఎస్. నిధులు పనులు చేయకుండానే స్వాహా చేసినట్టు పిర్యాదులు అందినట్టు ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి.ఆ నిధులన్నీ తనకు అంతరంగికుల అకౌంట్లకు కొట్టి వారి ద్వారా డ్రా చేయించి స్వాహా చేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పిన్నెల్లి అక్రమాలపై ప్రభుత్వం twara లోనే విచారణకు అదేశించనున్నట్టు తెలుస్తోంది.

Advertisement

Next Story