- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మరణానికి ముందే రామోజీ రావు నిర్మించుకున్న సమాధి ఫొటోలు, వీడియోలు వైరల్
దిశ, వెబ్‌డెస్క్: కొద్ది రోజుల నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతోన్న ఈనాడు సంస్థల అధినేత, అక్షర శైలి, అలుపెరగని పోరాట యోధుడు రామోజీరావు నిన్న (జూన్ 8)తుదిశ్వాస విడిచారు. ఈయన మరణం పట్ల దేశ ప్రధాని నరేంద్ర మోడీ, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రముఖ సినీ సెలబ్రిటీలు.. దేశవ్యాప్తంగా కోట్ల మంది సంతాపం తెలియజేశారు. అయితే ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో రామోజీరావు అంత్యక్రియలు జరుగుతున్నాయి. వేల మంది ఫిలిం సినీకి వచ్చి రామోజీ రావుకు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తున్నారు. రామోజీ రావుతో ఉన్న అనుబంధాన్ని, తన సేవలను గుర్తు చేసుకుని కంటతడి పెట్టుకుంటున్నారు. రామోజీ రావు అంత్యక్రియలకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా హాజరయ్యారు. అయితే రామోజీ రావు తన స్మారక కట్టడాన్ని తను బతికున్నప్పుడే ఏర్పాటు చేసుకున్నారు. రామోజీ ఫిల్మ్ సిటీలోనే విశాలమైన ప్రదేశంలో నిర్మించుకున్నారు. ఇప్పుడు ఆ స్మృతి కట్టడం వద్దే అంతిమ సంస్కారాలు జరగనున్నాయి. ప్రస్తుతం అలుపెరుగని పోరాట యోధుడు నిర్మించుకున్న స్మారక కట్టడం ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.