విశాఖ ఎంపీగా నన్ను గెలిపించకపోతే ప్రజలకే నష్టం: K A Paul

by Seetharam |   ( Updated:2023-11-16 10:34:06.0  )
విశాఖ ఎంపీగా నన్ను గెలిపించకపోతే ప్రజలకే నష్టం: K A Paul
X

దిశ, డైనమిక్ బ్యూరో : విశాఖపట్నం ఎంపీగా తనకు అవకాశం ఇవ్వాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కోరారు. విశాఖ వాసులు సహృదయంతో అర్థం చేసుకుని పార్లమెంట్ సభ్యుడుగా గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. తనను, ప్రజాశాంతి పార్టీని గెలిపించకపోతే ప్రజలే నష్టపోతారని కేఏ పాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్‌లో ప్రధాని నరేంద్రమోడీని ఎదుర్కొనే సత్తా తనకు మాత్రమే ఉందని ఇంకెవరికీ లేదని చెప్పుకొచ్చారు. విశాఖపట్నంలో ప్రధాని నరేంద్రమోడీ మీడియాతో మాట్లాడారు. తాను విశాఖ ఎంపీగా ఎన్నికైతే అనేక ప్రయోజనాలు ఉంటాయని ప్రజలు ఆలోచిస్తున్నారని చెప్పుకొచ్చారు. ప్రజలే కాదు రాజకీయ పార్టీలు సైతం తనను ఎంపీగా కోరుకుంటున్నారని చెప్పుకొచ్చారు. ప్రస్తుత విశాఖపట్నం ఎంపీ ఎంవీవీ సత్యనారాయన మళ్లీ ఎంపీగా పోటీ చేయరని తెలిసిందన్నారు. అంతేకాదు కేఏ పాల్‌కు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించినట్లు తనకు తెలిసిందన్నారు. ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఈ నిర్ణయం తీసుకోవడం సంతోషకరంగా ఉందన్నారు. అలాగే టీడీపీ ఎంపీ అభ్యర్థి భరత్ కూడా కేఏ.పాల్ విశాఖ ఎంపీ అయితే బాగుంటుందని తన అనుచరులకు చెబుతున్నట్లు తనకు తెలిసిందన్నారు. మరోవైపు మాజీ సీబీఐ జేడీ లక్ష్మీ నారాయణ సైతం తనను విశాఖపట్నం ఎంపీ అభ్యర్థిగా గెలిపించడానికి తన కోసం ప్రచారం చేస్తానని హామీ ఇచ్చారని చెప్పుకొచ్చారు. ఇకపోతే బీజేపీ అభ్యర్థిగా ఊహించుకుంటున్న రాజ్యసభ సభ్యులు జీవీఎల్‌ నరసింహారావు పోటీ చేస్తారో లేదో ఆయనకే తెలియదని అన్నారు. అసలు బీజేపీ పోటీ చేస్తే ఓట్లు ఎవరేస్తారు? ఎందుకు వేయాలి అని ప్రశ్నించారు. బీజేపీ స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిలుపుదల చేయలేదని మండిపడ్డారు. రైల్వే జోన్ హామీ ఏమైందని కేఏపాల్ నిలదీశారు. ఇంతలా రాష్ట్రానికి నష్టం చేసిన బీజేపీకి ప్రజలు ఎందుకు ఓటు వేస్తారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ నిలదీశారు.

Advertisement

Next Story

Most Viewed