- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలు వెంటనే చెల్లించండి: సీఎస్‌కు సీపీఐ నేత రామకృష్ణ లేఖ
దిశ, డైనమిక్ బ్యూరో : రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఉపాధ్యాయులు, ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలను తక్షణమే చెల్లించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఏపీ సీఎస్ కేఎస్ జవహర్‌రెడ్డికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆదివారం లేఖ రాశారు. ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 2 లక్షల మంది ఉపాధ్యాయులకు దాదాపు రూ.800 కోట్లు బకాయిలను ప్రభుత్వం చెల్లించాల్సి ఉందని అది చెల్లించాలని కోరారు.అలాగే ఉద్యోగులకు 2022 జూలై నుంచి ఇవ్వాల్సిన డీఏను 2024లో మూడు విడతల్లో చెల్లిస్తామని ప్రభుత్వం చెప్పటం చాలా దుర్మార్గం అన్నారు. తమ బకాయిలు చెల్లించాలని కోరుతూ ఉపాధ్యాయులు ఆందోళన బాట పట్టిన ప్రభుత్వంలో చలనం లేకపోవడం దురదృష్టకరమన్నారు. సీపీఎస్ రద్దు విషయంలో కూడా ఉద్యోగులు, ఉపాధ్యాయులకు అన్యాయం జరిగిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ తన లేఖలో పేర్కొన్నారు.