Breaking: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు

by srinivas |   ( Updated:2023-12-07 13:23:06.0  )
Breaking: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. స్టీల్ ప్లాంట్‌పై తన అభిప్రాయాన్ని కేంద్రహోంమంత్రి అమిత్ షా గౌరవించారని ఆయన చెప్పారు. అందుకే విశాఖ ఉక్కును ప్రైవేటుపరం కాకుండా ఆపగలిగామని పవన్ స్పష్టం చేశారు. విశాఖ ఏఎస్ రాజా కాలేజీ గ్రౌండ్‌లో నిర్వహించిన జనసేన బహిరంగ సభలో పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. తాను ప్రజల భవిష్యత్తుపై ఆలోచిస్తానని, అధికారం కోసం కాదని చెప్పారు. మార్పు కోసమే తాను ఓట్లు అడుగుతానని పవన్ పేర్కొన్నారు. ఉత్తరాంధ్రలో వలసలు ఆగాలని, ఉపాధి కల్పించాలని పవన్ కోరుకున్నారు. ఓటమికి తాను భయపడనని, లక్ష్యముంటే భయమెందుకని ప్రశ్నించారు. తన వద్ద డబ్బులు లేవని.. అయినా ప్రజల ప్రేమాభిమానాలతో జనసేనను నడుపుతున్నానని వ్యాఖ్యానించారు. ఓటములను తట్టుకుని ముందుకెళ్లానన్నారు. తన లక్ష్యానికి షార్ట్ కట్‌లు ఉండవని, పోరాటం చేస్తూనే ఉంటానని చెప్పారు. ‘నేను బీజేపీలోకి వెళ్తే మంచి పదవి ఇస్తారు. కానీ ఏపీ భవిష్యత్ కోసమే జనసేనను పెట్టా. ఉద్దానంలో కిడ్నీ సమస్యపై నేను మాట్లాడితేనే ఉత్తరాంధ్ర నేతల్లో చలనం వచ్చింది.. అప్పటి వరకూ ఎందుకు రాలేదు. జనసేనకు అధికారం ఇస్తే స్టీల్ ప్లాంట్‌ను నిలబెడతా. ఉత్తరాంధ్రలో ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రయత్నం చేస్తా.‘ అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

Advertisement

Next Story