- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మరీ ఇంత మంచితనం పనికిరాదు సార్.. 24 సీట్ల కోసం అవసరమా?
దిశ, డైనమిక్ బ్యూరో: 2024 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకెళ్తున్న టీడీపీ-జనసేన అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించింది. ఈ జాబితాలో మొత్తం 118 స్థానాలను ప్రకటించగా.. ఇందులో టీడీపీకి 94, జనసేనకు 24 అసెంబ్లీ, 3 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే పొత్తులో భాగంగా జనసేనకు సరైన సీట్లు రాలేదని పవన్ అభిమానులు, తదితరులు సోషల్ మీడియాలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 24 అసెంబ్లీ స్థానాల కోసం అంత అవసరమా అని మరి కొందరు సెటైర్లు వేస్తున్నారు.
ఫస్ట్ లిస్ట్‌లో 24 సీట్లు దక్కడంపై పవన్ కల్యాణ్ అభిమానిగా అవమానం జరిగిందని ఓ నెటిజన్ ఆవేదన వ్యక్తంచేశారు. మరోవైపు జనసేనకు ఓడిపోయే సీట్లు ఇచ్చారనే టాక్ నడుస్తోంది. ప్రస్తుత పరిస్థితి టీడీపీ మద్దతు లేకుండా 20 సీట్లు గెలుస్తామని, టీడీపీకి ఎందుకు మద్దతిస్తున్నామని పవన్‌ను ప్రశ్నించారు. మరి ఇంత మంచితనం పనికిరాదని అనిపిస్తుంది ఒక్కోసారి.. అంటూ అభిమాని సోషల్ మీడియా వేదికగా స్పందించారు. కాగా, సీట్ల వ్యవహారంపై పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ఎక్కువ స్థానాలు తీసుకుని ప్రయోగాలు చేయడం కంటే.. తక్కువ స్థానాలే మేలు అని అన్నారు.
Read More..
వైసీపీ నుండి వచ్చిన ముగ్గురు ఎమ్మెల్యేలకు బిగ్ షాకిచ్చిన చంద్రబాబు..!