బిగ్ ట్విస్ట్.. ముద్రగడ కూతురు క్రాంతికి పవన్ కల్యాణ్ బంపర్ ఆఫర్

by Disha Web Desk 19 |
బిగ్ ట్విస్ట్.. ముద్రగడ కూతురు క్రాంతికి పవన్ కల్యాణ్ బంపర్ ఆఫర్
X

దిశ, వెబ్‌డెస్క్: కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కుమార్తె కాంత్రికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ బంపర్ ఆఫర్ ఇచ్చారు. ముద్రగడ కుమార్తె జనసేనలోకి వస్తానంటే అండగా ఉంటానని హామీ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో క్రాంతిని జనసేన అభ్యర్థిగా పోటీ చేయిస్తానని ప్రకటించారు. కాగా, ఇటీవల వైసీపీలో చేరిన ముద్రగడ జనసేనానిపై విమర్శల వర్షం కురిపిస్తోన్న విషయం తెలిసిందే. పిఠాపురంలో పవన్ కల్యాణ్‌ను ఓడిస్తానని.. లేదంటే తన పేరు మార్చకుంటానని ఛాలెంజ్ సైతం చేశారు.

ఓ పక్కా పవన్ కల్యాణ్‌పై తండ్రి ముద్రగడ విమర్శలు చేస్తుంటే.. కూతురు క్రాంతి మాత్రం జనసేన అధినేతకు అండగా నిలబడ్డారు. పవన్ కల్యాణ్‌పై తన తండ్రి చేసిన విమర్శలను ఆమె తప్పుబట్టారు. తండ్రి, కూతుర్ల తీరు పిఠాపురం నియోజకవర్గంలో హాట్ టాపిక్‌గా మారింది. తనను ఓడించాలని కంకణం కట్టుకుని కూర్చున్న ముద్రగడ కూతురికి పవన్ జనసేన టికెట్ ఇస్తానని ఆఫర్ ఇవ్వడం ఏపీ పొలిటికల్ సర్కిల్స్‌లో చర్చనీయాంశంగా మారింది.

Next Story

Most Viewed