- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
చివరి నిమిషంలో ట్విస్ట్.. పవన్ కల్యాణ్ భీమవరం పర్యటన రద్దు
దిశ, వెబ్‌డెస్క్: జనసేన అధినేత పవన్ కల్యాణ్ భీమవరం పర్యటన రద్దు అయింది. అనూహ్యంగా చివరి నిమిషంలో హెలిప్యాడ్ ఏర్పాటుకు పోలీసులు, అధికారులు అనుమతి నిరాకరించడంతో రేపటి పవన్ కల్యాణ్ పర్యటన రద్దు అయిందని స్థానిక పార్టీ నేతలు స్పష్టం చేశారు. అయితే, హెలిక్యాప్టర్‌లో వెళ్లి రోజూ రాత్రి అమరావతి చేరుకునేలా పవన్ కల్యాణ్ షెడ్యూల్ ప్రిపేర్ చేసుకున్నారు. ఎన్నికల సమీపిస్తోన్న వేళ కసరత్తు చేపట్టాల్సి ఉన్నందున ప్రతి రోజూ పార్టీ ప్రధాన కార్యలయానికి రావాలని పవన్ కల్యాణ్ భావించారు.
ఈ క్రమంలోనే వివిధ ప్రాంతాల్లో హెలిప్యాడ్ల ఏర్పాటుకు ఏర్పాట్లు ప్రారంభించారు. ఈ క్రమంలో అనూహ్యంగా ఆర్ అండ్ బీ అధికారులు అనుమతులు నిరారిస్తున్నట్లు నోటీసులు జారీ చేశారు. దీంతో జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార వైసీపీ నేతల ఒత్తిడి కారణంగానే పోలీసులు, అధికారులు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారని అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ విధమైన చర్యలకు పాల్పడుతున్నాడంటే.. జగన్ తన ఓటమిని పరోక్షంగా ఒప్పుకున్నట్లే అని అంటున్నారు. రాబోయేది జనసేన-టీడీపీ ప్రభుత్వమే అని అప్పుడు అందరి వాటాలు చెల్లిస్తామని హెచ్చరించారు.