కాసేపట్లో ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్న పవన్ కల్యాణ్

by Sathputhe Rajesh |   ( Updated:2024-06-19 07:19:37.0  )
కాసేపట్లో ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్న పవన్ కల్యాణ్
X

దిశ, వెబ్‌డెస్క్: జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ నేడు ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. విజయవాడ క్యాంపు కార్యాలయంలో పవన్ కల్యాణ్ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఉదయం 9 గంటలకు పవన్ బాధ్యతలు స్వీకరిస్తారు. అనంతరం ఉదయం 11 గంటలకు ఐఏఎస్ అధికారులతో పవన్ సమావేశం కానున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో సమావేశం నిర్వహిస్తారు. మరోవైపు హోంమంత్రిగా వంగలపూడి అనిత నేడు బాధ్యతలు స్వీకరించనున్నారు. సచివాలయం బ్లాక్ 2లో హోంమంత్రి అనిత బాధ్యతలు స్వీకరిస్తారు.

Also Read: పిఠాపురంకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..

Advertisement

Next Story