ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడిపై పవన్ కల్యాణ్ స్పెషల్ కవిత్వం

by Sathputhe Rajesh |   ( Updated:2024-06-22 07:32:08.0  )
ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడిపై పవన్ కల్యాణ్ స్పెషల్ కవిత్వం
X

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీ అసెంబ్లీలో శనివారం ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. అయ్యన్నపాత్రుడిపై జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ వినిపించిన కవిత్వంతో సభలో నవ్వులు పూశాయి. మీకు కోపం వస్తే రుషికొండను చెక్కినట్లు పదునైన ఉత్తరాంధ్ర యాసలో ప్రత్యర్థులకు గుండు కొట్టేస్తారన్నారు. దీంతో సభలో ఒక్కసారిగా అందరూ నవ్వారు. అయితే పవన్ మాట్లాడుతూ.. ఒకటే విషయం బాధేస్తుందని.. ఇకపై మీకు తిట్టే అవకాశం లేకపోవడం.. సభలో ఎవరైనా తిడితే ఆపే బాధ్యత మీపైనే ఉంది మీరే మైక్ కట్ చేయాలన్నారు. గత ప్రభుత్వం వ్యక్తిగత దూషణలతో రాష్ట్రాభివృద్ధిని ఆపేసిందని.. భాష మనసులను కలపడానికే.. కాని విడగొట్టడానికి కాదన్నారు. ఎంత జఠిలమైన సమస్య అయిన చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చన్నారు.

Also Read...

ఏపీ అసెంబ్లీ న్యూ స్పీకర్ అయ్యన్న పై ప్రశంసల వర్షం కురిపించిన డిప్యూటీ సీఎం పవన్

Advertisement

Next Story

Most Viewed