- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పోలింగ్ బూత్‌లో అజ్ఞానం చాటిన పవన్ కల్యాణ్.. దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు..!
దిశ, వెబ్‌డెస్క్: నేడు రెండు తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ బూత్‌ల వద్ద జనాలు పోటెత్తారు. ఓటర్లందరూ తమ తమ ఓటును వినియోగించుకుంటున్నారు. నగరం నుంచి జనాలంతా ఊరు బాట పట్టడంతో ఒక్కసారిగా గ్రామాల్లో పండగ వాతావరణం నెలకొంది. వేసవి కాలం కావడంతో ప్రజలంతా ఉదయాన్నే పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. అరగంట ముందే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు భారీగా తరలివచ్చారు. దీంతో కొన్ని పోలింగ్ కేంద్రాలన్నీ జనజాతరను తలపిస్తున్నాయి. ఇకపోతే ఏపీలో పోలింగ్ బూత్ వద్ద జనసేన అధినేత పవన్ కల్యాణ్ అజ్ఞానం చాటారు.
ఈవీఎంలో ఓటు వేసిన తర్వాత ప్రింట్ అవుట్ రాదా..? అంటూ అవివేకంగా పవన్ కల్యాణ్ అడిగారు. వీవీపాట్‌లో మాత్రమే చూసుకోవచ్చంటూ సిబ్బంది సమాధానం జనాలకు మరింత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. దీంతో 2 లక్షల పుస్తకాలు చదివిన జ్ఞానం ఇదేనా పవన్ కళ్యాణ్..? ఖర్మ కాకపోతే ఓటు గురించి బేసిక్ ఐడియా లేని నువ్వు ఓ రాజకీయ పార్టీకి అధ్యక్షుడివా..? అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.