- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పెన్షన్ల పంపిణీపై పవన్ కల్యాణ్ సంచలన ట్వీట్.. జన సైనికులకు కీలక విజ్ఞప్తి
దిశ, వెబ్‌డెస్క్: ఏపీ ఎన్నికల నేపథ్యంలో పింఛన్ల వివాదం రాష్ట్రంలో తీవ్ర చర్చానీయాంశంగా మారింది. ఇప్పటి వరకు ప్రతి నెల వృద్ధులకు, వికలాంగులకు సచివాలయ సిబ్బంది ఇంటి వద్దకి వెళ్లి పెన్షన్స్ పంచగా.. ఈ నెల మాత్రం లబ్ధిదారులు సచివాలయాలకు వచ్చి పింఛన్ తీసుకోవాలని నిన్న ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి జిల్లా కలెక్టర్లలో వీడియో కాన్ఫరెన్స్ పెట్టి క్లారిటీ ఇచ్చారు. అయితే తాజాగా దీనిపై జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ట్వీ్ట్ చేశారు. ‘‘జనసేన నాయకులు, జన సైనికులకు నా విజ్ఞప్తి. పింఛన్లు తీసుకోవాల్సిన వృద్ధులకు, దివ్యాంగులకు తోడుగా ఉండండి. పింఛన్ ఇచ్చే కార్యాలయానికి మీ వాహనంపై జాగ్రత్తగా తీసుకువెళ్ళండి. పింఛన్ ఇప్పించండి. ఆ తర్వాత ఇంటి దగ్గర దించి రండి. సామాజిక బాధ్యతగా మీరంతా పింఛన్లు తీసుకొనేవారికి సహాయం అందించడంతో తప్పేం లేదు. జనసేన శ్రేణులతోపాటు కూటమిలో భాగమైన టీడీపీ, బీజేపీ కార్యకర్తలు, నాయకులు ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవాలని కోరుతున్నాను.’’ అంటూ ట్వీట్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రెటరీ గారు.. వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులకు ఇళ్ళ దగ్గర పింఛను అందించడానికి ఉన్న ఇబ్బంది ఏమిటి? పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అయితే థియేటర్స్ దగ్గర రెవెన్యూ ఉద్యోగులకి డ్యూటీలు వేస్తారు. తహశీల్దార్ నంబర్స్ ఇస్తారు. మరి పింఛన్లు ఇవ్వడానికి ఉద్యోగులు లేరా? కరోనా కాలంలో మద్యం షాపుల దగ్గర ఉద్యోగులకి డ్యూటీ వేసిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు, గ్రామ రెవెన్యూ యంత్రాంగం ద్వారా పెన్షన్లు ఇళ్ళ దగ్గర ఇవ్వొచ్చు. వైసీపీ నాయకులు చేసే మెలో డ్రామాలకీ, బ్లేమ్ గేమ్స్ కీ ప్రభుత్వ నిర్ణయాలు బలం ఇస్తున్నాయి’’ అంటూ పవన్ కల్యాణ్ రాసుకొచ్చారు.